Breaking News

ప్రారంభమైన సివిల్‌ సప్లయి హమాలీల‌ నిరవధిక సమ్మె

కామారెడ్డి, ఫిబ్రవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి మండల‌ స్థాయి గిడ్డంగి వద్ద సివిల్‌ సప్లై హమాలీ కార్మికులు నిరవధిక సమ్మె ప్రారంభించారు. సివిల్‌ సప్లై జిల్లా కార్యదర్శి జి రాజు మాట్లాడుతూ హమాలి రేట్లు క్వింటాలుకు 18 రూపాయలు నుంచి ఇరవై మూడు రూపాయల‌కు ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది, కానీ ఇప్పటివరకు జిఓ ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు.

సివిల్‌ సప్లై చైర్మన్‌ హమాలీ కార్మికుల‌ న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాల‌ని తెలిపారు. ఇదివరకు నాలుగు నెల‌లు గడిచినా జీవో ఇవ్వడం లేదు కాబట్టి సివిల్‌ సప్లై హమాలీ కార్మికులు ఎగుమతి దిగుమతి ధర జీవోను ఇచ్చేవరకూ నిరవధిక సమ్మె విరమించమని పేర్కొన్నారు. ముందు ముందు ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సంపత్‌, బాజీ శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, గంగరాజు, భీమయ్య, వీరయ్య, నరసయ్య, బీరయ్య, శేఖర్‌, లింగం, మహేష్‌, కృష్ణ, ఎం.శ్రీనివాస్‌, నరేష్‌ కార్మికులు పాల్గొన్నారు.

Check Also

ఆదర్శం సనత్‌ కుమార్‌ శర్మ

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో ...

Comment on the article