Breaking News

కామారెడ్డిలో బార్లు దక్కించుకున్న వారు వీరే…

కామారెడ్డి, ఫిబ్రవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధ్వర్యంలో జిల్లాలోని కామారెడ్డి మున్సిపాలిటీ పరిథిలో ఒకటి, బాన్సువాడ మున్సిపాలిటీ పరిథిలో 2, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఒకటి చొప్పున మొత్తం నాలుగు నూతన బార్లకు సంబంధించిన ల‌క్కీ డ్రా కార్యక్రమం జనహిత భవన్‌లో జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ సమక్షంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు ల‌క్కీ డ్రా తీశారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 55 దరఖాస్తులు రాగా అక్కల‌ ల‌క్ష్మి, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 47 దరఖాస్తులు రాగా నారాయణ, బాన్సువాడ మున్సిపాలిటీలో 71 దరఖాస్తులు రాగా ఏ.శ్రీకాంత్‌, జి.నాగనాధ్ ల‌క్కీ డ్రాలో లైసెన్సులు పొందారు. కార్యక్రమంలో జిల్లా మద్య నిషేధ, ఆబ్కారీ అధికారి శ్రీనివాస్‌, ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది పాల్గొన్నారు

Check Also

ఆదర్శం సనత్‌ కుమార్‌ శర్మ

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో ...

Comment on the article