నిజామాబాద్, ఫిబ్రవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళితుల అభ్యున్నతికి కృషి చేసిన భాగ్యరెడ్డివర్మ తెలంగాణ గడ్డపై జన్మించిన అగ్రశ్రేణి సామాజిక సంస్కర్త అని హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. గురువారం హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో జరిగిన భాగ్యరెడ్డివర్మ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
హిందూమతంలో సంస్కరణ కోరుకుని, దళిత జాతి అభ్యున్నతికి, దళిత జాతి చదువులకు, దళిత జాతి చైతన్యానికి ఎంతో శ్రమించిన వ్యక్తి అని నివాళులు అర్పించారు. సామాజిక సంస్కర్తగా ప్రజా జర్నలిస్టుగా ఆయన కృషి అందరికీ స్పూర్తిదాయకమే అన్నారు. దళితుల కోసం ప్రత్యేక పాఠశాలలు, బ్రహ్మసమాజ్, ఆర్యసమాజ్, సంఘసంస్కార నాటక మండలి, దేవదాసీ నిర్మూలనోద్యమం, ఆదిహిందూవు ఐక్యత, దళితుల ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమైనదన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, కొయ్యడ శంకర్, కేర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ, సందీప్, నరేష్, దుబ్బాక సందీప్ తదితరులు పాల్గొన్నారు. భాగ్యరెడ్డివర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తిచేయాలి - February 26, 2021
- బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి - February 26, 2021
- పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి - February 26, 2021