నిజామాబాద్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం నిజామాబాద్ జిల్లాలోఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హై కోర్ట్ అడ్వకేట్లు వామన్ రావు దంపతుల హత్యకు నిరసనగా నిజామాబాద్ నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్ నుండి ఎన్టిఆర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వేణు రాజు మాట్లాడుతూ తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో లేవని రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యం కాకుండా రౌడీల రాజ్యం, గుండాల రాజ్యం నడుస్తోందని ఆందోళన ...
Read More »Daily Archives: February 19, 2021
చెక్కుల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కుల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ శాఖల అధికారులతో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై సమీక్ష నిర్వహించారు. అర్హతగల లబ్ధిదారులకు చెక్కులను స్థానిక ఎమ్మెల్యేలతో ఇప్పించాలని కోరారు. బడ్జెట్ కనుగుణంగా లబ్ధిదారులకు చెక్కులు అందేవిధంగా చూడాలన్నారు. పెండింగ్ దరఖాస్తులు ఉంటే ...
Read More »ఫ్రంట్ లైన్ వారియర్స్ రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతిరోజు తమ విధుల్లో భాగంగా ప్రజలతో మమేకమై ఉండే ఫ్రంట్లైన్ వారియర్స్ తప్పనిసరిగా తమ రెండవ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, జిల్లాలో చేపట్టిన పనులన్నీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లా మండల స్థాయి అధికారులతో కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోవిడ్ వ్యాక్సినేషన్ రెండో డోసు, హరితహారం, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, ఉపాధిహామీ లేబర్ టర్నవుట్ నర్సరీ ...
Read More »ఛత్రపతి శివాజీ వ్యక్తిత్వం ఎలాంటిదంటే…
ఒకసారి శివాజీ సైనికాధికారి ఓ ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడలును తీసుకొచ్చాడు. ఆమెను శివాజీ ముందు ప్రవేశపెట్టడంతో శివాజీ ఆ సైనికాధికారిని మందలిస్తూ ఇలా అన్నాడు. నా తల్లి కూడా మీ అంత అందమైనదైవుంటే నేను కూడా అందంగా ఉండేవాడిని అని ఆమెను తల్లిగా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి తిరిగి పంపించాడు. అందుకే శివాజీ అంటే కులమతాలతో తేడా లేకుండా ఎంతగానో అభిమానించేవారు. భారతదేశంలో ఎందరో రాజు పాలించినప్పటికీ శివాజీకి వున్న గొప్పతనం విభిన్నమైనది. శివాజీ వ్యక్తిత్వం అందరికి ఆదర్శం.
Read More »న్యాయవాదుల విధుల బహిష్కరణ
బోధన్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైకోర్ట్ న్యాయవాదులను క్రూరంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రెండవ రోజు బోధన్ బార్ అసోసియేషన్ సభ్యులు విధులు బహిష్కరించారు. ఇటీవల జరిగిన సంఘటన పై బోధన్ బార్ అసోసియేషన్లో సమావేశం నిర్వహించారు. హైకోర్ట్ న్యాయవాదులైన వామన్ రావ్ వారి సతీమణి నాగమణి దంపతుల పై దాడి హత్య అత్యంత హేహమైన చర్యగా పేర్కొని నిందితులను కఠినంగా శిక్షించాలని రెండవ రోజు కుడా విధులు బహిష్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన ...
Read More »ఆర్మూర్లో ఛత్రపతి శివాజీ జయంతి
ఆర్మూర్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ 391 వ జయంతిని ఆర్మూర్ లోని శివాజీ చౌక్ (గోల్ బంగ్లా) వద్ద ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్ కుమార్ ...
Read More »