Breaking News

ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల‌ ర్యాలీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నిజామాబాద్‌ జిల్లాలోఎన్‌.ఎస్‌.యు.ఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల‌ ర్యాలీ నిర్వహించారు. హై కోర్ట్‌ అడ్వకేట్‌లు వామన్‌ రావు దంపతుల‌ హత్యకు నిరసనగా నిజామాబాద్‌ నగరంలోని జిల్లా కాంగ్రెస్‌ భవన్‌ నుండి ఎన్‌టిఆర్‌ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా వేణు రాజు మాట్లాడుతూ తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో లేవని రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యం కాకుండా రౌడీల‌ రాజ్యం, గుండాల‌ రాజ్యం నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. హై కోర్ట్‌ న్యాయవాదులు వామనరావు దంపతుల‌ హత్యతో మరోసారి రుజువైందన్నారు. పట్టపగలు నడిరోడ్డు పైన హత్యలు జరుగుతుంటే తెరాస ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. కెసిఆర్‌ అధికారంలోకి వచ్చిననాటి నుండి రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని, నడిరోడ్డు పైన హైకోర్టు న్యాయవాదుల‌ను అతి కిరాతకంగా నరికి చంపినా ఇప్పటివరకు కెసిఆర్‌ స్పందించకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు.

తెరాస ప్రభుత్వంలో న్యాయవాదుల‌కు కూడా రక్షణ లేకుండా పోతే ఇక సామాన్య ప్రజల‌ పరిస్థితి ఏంటని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామని వేణు అన్నారు. హత్య కేసులో అధికార పార్టీ నేతలు ఉన్నందున కేసు నీరుగార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నదని, కాబట్టి ఈ కేసును సిబిఐకి అప్పగించాల‌ని డిమాండ్‌ చేశారు.

అలాగే నిందితుల‌ను కఠినంగా శిక్షించాల‌ని జిల్లా ఎన్‌ఎస్‌యుఐ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్‌.ఎస్‌.యు.ఐ నాయకులు, కార్యకర్తలు, జిల్లా జనరల్‌ సెక్రటరీ నరన్‌దీప్‌, అభిలాశ్‌ కుమార్‌, అరవింద్‌, ప్రవీణ్‌, సూర్య, శివ, శ్రీకాంత్‌, రాజేందర్‌, రాఘవ, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

భీమ్‌గల్‌ బార్‌ దక్కించుకున్న బద్దం రాకేశ్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మునిసిపాలిటీలో కొత్తగా నోటిఫై చేయబడిన ...

Comment on the article