Breaking News

చెక్కుల‌ చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబారక్‌ పథకానికి దరఖాస్తు చేసుకున్న ల‌బ్ధిదారుల‌కు చెక్కుల‌ చెల్లింపులో జాప్యం లేకుండా చూడాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ శాఖల‌ అధికారుల‌తో కల్యాణ ల‌క్ష్మి షాదీ ముబారక్‌ పథకాల‌పై సమీక్ష నిర్వహించారు.

అర్హతగల ల‌బ్ధిదారుల‌కు చెక్కుల‌ను స్థానిక ఎమ్మెల్యేల‌తో ఇప్పించాల‌ని కోరారు. బడ్జెట్‌ కనుగుణంగా ల‌బ్ధిదారుల‌కు చెక్కులు అందేవిధంగా చూడాల‌న్నారు. పెండింగ్‌ దరఖాస్తులు ఉంటే వాటిని పరిష్కారం చేయాల‌ని సూచించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, వివిధ శాఖల‌ అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఆదర్శం సనత్‌ కుమార్‌ శర్మ

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో ...

Comment on the article