Breaking News

ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ రెండవ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిరోజు తమ విధుల్లో భాగంగా ప్రజల‌తో మమేకమై ఉండే ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ తప్పనిసరిగా తమ రెండవ డోస్‌ కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాల‌ని, జిల్లాలో చేపట్టిన పనుల‌న్నీ పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లా మండల‌ స్థాయి అధికారుల‌తో కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ రెండో డోసు, హరితహారం, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, ఉపాధిహామీ లేబర్‌ టర్నవుట్‌ నర్సరీ పెంపకం, రైతు కల్లాలు క్రిమటోరియముపై మెడికల్‌ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, తహసిల్దార్లు సిడిపివోలు, ఏపీఓస్‌.ఎం పీవోస్‌ తో పలు విషయాల‌పై ఆదేశాలు జారీ చేశారు. కోవిడు వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ తీసుకున్న ఫ్రంట్‌ లైన్‌ సిబ్బంది అధికారులు తప్పక రెండో డోసు తీసుకోవాల‌ని తెలిపారు.

ప్రపంచ దేశాలు మనవైపు చూస్తున్నాయని, వేరే కంట్రీస్‌ కు మన దేశం వ్యాక్సిన్‌ సప్లయి చేస్తుందన్నారు. కొంతమంది అవగాహన లేక సెకండ్‌ డోస్‌ తక్కువ మంది తీసుకున్నారని, ఫస్ట్‌ డోస్‌ తీసుకున్నవారు రెండవ డోసు తప్పక తీసుకోవాల‌న్నారు. పూర్తిస్థాయిలో టెస్ట్‌ చేసిన తర్వాతనే ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు చాలామందిని కలిసే అవకాశం ఉంది, అందులో ఎవరికి వైరస్‌ ఉన్నా వారికి కూడా వచ్చే అవకాశం ఉందని తెలిసిన వారికి కూడా కోవిడ్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. 11 వేల‌ 592 మంది సెకండ్‌ డోస్‌ తీసుకోవాల‌ని తెలిపారు.

మనం రోల్‌ మోడల్‌ గా ఉండాల‌న్నారు. హరిత హారంలో నాటిన ప్రతి మొక్క బ్రతకాల‌ని, మొక్కల‌కు జియో టాగింగ్‌ చేయాల‌ని, 17వ తేదీన నాటిన మొక్కలు వంద శాతం బ్రతకాల‌న్నారు. వచ్చే ఎండాకాలంలో మొక్కలు ఎండకుండా వాటర్‌ డే పాటించాల‌న్నారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిలో టాయిలెట్స్‌, జిమ్ము, డంపింగ్‌ యార్డ్‌, శానిటేషన్‌, ఉపాధి హామీ లేబర్‌ పెంచాల‌న్నారు. 2020- 21 కి టార్గెట్‌ మార్చి లోగా పూర్తి చేయాల‌న్నారు.

2021-22 కు ఏప్రిల్‌ మే జూన్‌ సిస్టమేటిక్‌ గా బేస్‌ చేయాల‌ని పర్‌ఫెక్టుగా ప్లాన్‌ చేసుకోవాల‌ని తెలిపారు. టార్గెట్‌ రీచ్‌ అవ్వాలంటే సోమవారం నుండి ప్రతి గ్రామ పంచాయతీకి రోజు 50 మందికి తగ్గకుండా పని కల్పించాల‌న్నారు. ప్రతి విలేజిలో డిమాండ్‌ పెరగాల‌న్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఎవరైనా సరిగా పని చేయకుంటే వారిపై యాక్షన్‌ తీసుకుంటామన్నారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి లో పెండిరగ్‌లో ఉన్న పనులు వారంలో పూర్తి చేయాల‌న్నారు.

నర్సరీలో బ్యాగ్స్‌ ఫిల్లింగ్‌ చేసి సీడ్‌ ఫిల్లింగ్‌ చేసి జనరేట్‌ కానివి రిప్లేస్మెంట్‌ చేయాల‌న్నారు. వచ్చే శుక్రవారం వరకు ఏవి ఖాళీ ఉండవద్దన్నారు. ప్రతి నర్సరీలో 20 వేల‌ మొక్కలు పెరుగుతూ ఉండే విధంగా చర్యలు తీసుకోవాల‌న్నారు. రైతు కల్లాలు జిల్లాలో 3 వేల‌ 700 మొత్తానికి గాను గ్రౌండింగ్‌ 2 వేల‌ 500 కాగా ఇంకా వెయ్యి వెంటనే పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాల‌న్నారు. వచ్చేవారం రైతు కల్లాలు మంచి ప్రోగ్రెస్‌ రావాల‌ని తెలిపారు.

క్రిమటోరియంసు పూర్తి చేయాల‌న్నారు. రైతు కల్లాలు 31 మార్చి వరకు పూర్తి చేయాల‌న్నారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్స్‌ మొక్కల‌కు నీళ్లు పోయడానికి పర్‌ఫెక్టు ఉపయోగించుకోవాలి అన్నారు. వీడియో కాన్ఫరెన్సులో అడిషనల్‌ కలెక్టర్ ల‌త, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, డిఎంహెచ్‌ఓ సుదర్శనం, జడ్పీ సిఇఓ గోవింద్‌, డిఆర్‌డిఓ శ్రీనివాస్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Check Also

భీమ్‌గల్‌ బార్‌ దక్కించుకున్న బద్దం రాకేశ్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మునిసిపాలిటీలో కొత్తగా నోటిఫై చేయబడిన ...

Comment on the article