నిజామాబాద్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నీటిపారుదల శాఖలోని అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి లక్ష్యాన్ని పూర్తి చేయుటకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశం మందిరంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఆస్తులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈనెల 22 వరకు 30 చెక్ డ్యామ్‌లకు సంబంధించి ప్రోగ్రెస్ ...
Read More »Daily Archives: February 20, 2021
పంట రుణాల లక్ష్యాన్ని సాధించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పంట బుణాల లక్ష్యాన్ని బ్యాంకర్ల సమన్వయంతో వ్యవసాయ అధికారులు సాధించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో పంట బుణాలు, బ్యాంక్ లింకేజీ, వీధి వర్తకుల ఋణాలు, స్వయం సహాయక ఋణాలు, ఎస్సి యాక్షన్ ప్లాన్ లక్ష్యాలను, ఫలితాలను అధికారులతో జిల్లా కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, యాసంగి పంట బుణాల లక్ష్యం 907 కోట్లకు గాను 501 కోట్లు 52,422 మందికి ...
Read More »మూడోరోజు సివిల్ సప్లయి హమాలీల సమ్మె
కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సివిల్ సప్లయి కామారెడ్డి హమాలీ కార్మికులు 15 నిమిషాల పాటు నిరసన వ్యక్తం చేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మూడవరోజు నిరవధిక సమ్మె సందర్భంగా వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎల్ దశరథ్, జిల్లా కార్యదర్శి జి రాజు మాట్లాడుతూ సివిల్ సప్లయి హమాలీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన రేట్ల జీవోను ఇప్పటివరకు కూడా ఇవ్వకపోవడం ...
Read More »రైతు గర్జన గోడప్రతుల ఆవిష్కరణ
ఆర్మూర్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆర్మూర్ కమిటీ ఆధ్వర్యంలో 25న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఇందుకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని లక్షలాదిమంది రైతులు దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కొనసాగిస్తున్నారని, ఈ ఆందోళనను అనేక ప్రచారాలతో అట్లాగే పోలీసు నిర్మాణాలతో బిజెపి ఆర్ఎస్ఎస్ శక్తులు తప్పు త్రోవ పట్టింఛటానికి ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం ...
Read More »జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
ఆర్మూర్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై అయ్యప్ప ఆలయం వద్ద శనివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు మహారాష్ట్రకు చెందిన హర్షల్ సురేష్ భోంకర్ అనే 23 సంవత్సరాల యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు ఎస్.ఐ. విజయ్ నారాయణ తెలిపారు. మృతదేహంపై నుంచి భారీ వాహనాలు వెళ్లడంతో తునాతునకలు అయి గుర్తుపట్టలేని విధంగా మారిందని, మృతదేహాన్ని ...
Read More »మానస గణేష్‌కు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు
ఆర్మూర్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపాలిటీలోని మామిడిపల్లికి చెందిన మానస స్వచ్చంద సేవ సంస్థ వ్యవస్థాపకులు మానస గణేష్ నిర్మల్ జిల్లాలోని లోకేశ్వర్లో జరిగిన అమ్మానాన్న ఫౌండేషన్ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో రాష్ట్రస్థాయి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును అందుకున్నారు. అమ్మ నాన్న ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆంజనేయులు, ముధోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, డాక్టర్ నాగరాజు చేతులమీదుగా అవార్డు ప్రదానం జరిగింది. కోవిడ్ వల్ల రాష్ట్రమంతటా లాక్డౌన్ సమయంలో వలసకూలీలకు నిరుపేదలకు నిత్య ...
Read More »లింబాద్రిలో భక్తుల రద్దీ
భీమ్‌గల్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ నింబాచల క్షేత్రం శనివారం రోజు ఉదయం 6 గంటల నుండి దర్శనాల రద్దీ ప్రారంభమైంది. కరోన తర్వాత రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది. శనివారం ఉదయం నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారికేడ్ల మధ్య కూర్చొని వేచి చూసారు. 6 గంటల తరవాత గుడి తెరుచుకోగానే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ...
Read More »