కామారెడ్డి, ఫిబ్రవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పంట బుణాల లక్ష్యాన్ని బ్యాంకర్ల సమన్వయంతో వ్యవసాయ అధికారులు సాధించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో పంట బుణాలు, బ్యాంక్ లింకేజీ, వీధి వర్తకుల ఋణాలు, స్వయం సహాయక ఋణాలు, ఎస్సి యాక్షన్ ప్లాన్ లక్ష్యాలను, ఫలితాలను అధికారులతో జిల్లా కలెక్టరు సమీక్షించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, యాసంగి పంట బుణాల లక్ష్యం 907 కోట్లకు గాను 501 కోట్లు 52,422 మందికి అందించడం జరిగిందని, మిగతా లక్ష్యాన్ని బ్యాంకర్ల సమన్వయంతో బ్రాంచీల వారిగా క్షేత్రస్థాయిలో బుణ మంజూరు చేయించాలని, అనుకున్న సమయంలోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు.
మెప్మా సంఘాలకు అర్బన్ బ్యాంక్ లింకేజీ లక్ష్యం 26 కోట్లకు గాను 28 కోట్లు అందించి 101 శాతం సాధించడం జరిగిందని, వీధి వర్తకులకు బుణ సౌకర్యం క్రింద 7703 మందికి గాను 6991 మందికి 6 కోట్ల 99 లక్ష పది వేల ఋణం మంజూరు చేయడం ద్వారా 91 శాతం సాధించడం జరిగిందని, లక్ష్లలోపు జనాభా కేటగిరీలో కామారెడ్డి మున్సిపాలిటీ దేశంలోనే మొదటి స్థానంలో వుందని పేర్కొంటూ శాంక్షన్ అయిన వాటిలో మిగులు లక్ట్యాన్ని లబ్దిదారుల ఖాతాలో జమ అయ్యేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజీ బుణాల క్రింద 11,653 సంఘాలకు 466 కోట్లకు గాను 461 కోట్లు మంజూరు చేయడం ద్వారా 99 శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ముందుందని, మంజూరైన సంఘాలకు బ్యాంకర్ల సహకారంతో వెంటనే బుణాలు అందించాలని, డిపిఎం, ఎపిఎంలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. షెడ్యూల్డు కులాల యాక్షన్ ప్లాన్ 2020-21 క్రింద వారి సంక్షేమానికి 23 కోట్లు మంజూరు అయ్యాయని, భూమి కొనుగోలు, భూమి అభివృద్ది, బోర్‌వెల్స్, విద్యుత్ సదుపాయం, ట్రాన్స్‌పోర్టు రంగంలో బ్యాంక్ లింకేజీతో ట్రాక్టర్స్, హార్వెస్టర్స్, టాక్సీ కార్లు, ఆటోలు తదితర 537 యూనిట్లకు సంబంధించి ఈనెల 23 లోగా మండల స్థాయి కమిటీ ద్వారా లబ్దిదారులను గుర్తించాలని ఎస్సి కార్పోరేషన్ అధికారిని ఆదేశించారు.
సమీక్షా కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా లీడ్ మేనేజరు రాజేందర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా ఎస్సి కార్పోరేషన్ అధికారి దయానంద్, మెప్మా పిడి శ్రీధర్‌రెడ్డి, డిపిఎంలు శ్రీధర్, తిరుపతయ్య, బాన్సువాడ మున్సిపల్ కమీషనర్, అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 15 వరకు ఎం.ఎడ్. పరీక్షల ఫీజు గడువు - March 5, 2021
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021