Breaking News

నీటి పారుద‌ల శాఖ అధికారుల‌తో కలెక్టర్‌ సమీక్ష

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటిపారుదల‌ శాఖలోని అన్ని విభాగాల‌ను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ల‌క్ష్యాన్ని పూర్తి చేయుటకు అధికారులు కృషి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి నీటిపారుదల‌ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌ సమావేశం మందిరంలో ఇరిగేషన్‌ శాఖ అధికారుల‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన ఆస్తుల‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాల‌న్నారు.

ఈనెల‌ 22 వరకు 30 చెక్‌ డ్యామ్ల‌‌కు సంబంధించి ప్రోగ్రెస్‌ డిటేల్స్‌ ఇవ్వాల‌ని, 24 వరకు ప్రతి చెరువుకు సంబంధించి సర్వే నెంబర్స్‌, విస్తీర్ణము తదితర వివరాలు అందించాల‌న్నారు. చెక్‌ డ్యాములు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మే చివరికి పూర్తి చేయాల‌న్నారు. ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ లో కెనాల్స్‌ డీసిల్టింగ్‌కు చర్యలు తీసుకోవాల‌న్నారు. కచ్చ డ్రైన్స్‌ తీయడం, ఫార్మేషన్‌ ఆఫ్‌ ఫీడర్‌ చానల్స్‌ ఐడెంటిఫై చేసుకోవాల‌ని తెలిపారు.

మార్చి తర్వాత చాలా వర్కింగ్‌ సీజన్‌ ఉంటుందని ఆ టైంలో అన్ని కెనాల్లో డిసిల్టింగ్‌ చేయాల‌న్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలో ఒక డ్రైవ్‌ పెట్టి ఎస్టిమేషన్‌ జనరేట్‌ చేసి ఏప్రిల్‌ రెండో వారం వర్కింగ్‌ టేకప్‌ చేద్దామన్నారు. ఇరిగేషన్‌ కెనాల్స్‌ అన్నీ కూడా మే లో ప్రాపర్‌ గా కొత్తవి చేద్దామని, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ లో పను పెద్ద ఎత్తున జరగాల‌న్నారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఇరిగేషన్‌ సిఈ మధుసూదన్‌ రావు, నిజామాబాద్‌ ఎస్‌ఇ బద్రి నారాయణ, కామారెడ్డి ఎస్‌ఇ నాగేందర్‌, ఈఈలు, డిఈలు, జెఈలు పాల్గొన్నారు.

Check Also

భీమ్‌గల్‌ బార్‌ దక్కించుకున్న బద్దం రాకేశ్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మునిసిపాలిటీలో కొత్తగా నోటిఫై చేయబడిన ...

Comment on the article