Breaking News

రైతు గర్జన గోడప్రతుల‌ ఆవిష్కరణ

ఆర్మూర్‌, ఫిబ్రవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆర్మూర్‌ కమిటీ ఆధ్వర్యంలో 25న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాల‌ని ఇందుకు సంబంధించిన గోడప్రతుల‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్‌ మాట్లాడుతూ రైతాంగ వ్యతిరేక చట్టాల‌ను‌ రద్దు చేయాల‌ని ల‌క్షలాదిమంది రైతులు దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కొనసాగిస్తున్నారని, ఈ ఆందోళనను అనేక ప్రచారాల‌తో అట్లాగే పోలీసు నిర్మాణాల‌తో బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు తప్పు త్రోవ పట్టింఛటానికి ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇందులో భాగంగానే తాము సైతం రైతుల‌కు తోడుగా కార్పొరేట్‌ కంపెనీల‌కు కానివ్వకుండా రైతాంగానికి కాపాడుకోవడానికి ఈ నెల‌ 25న నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ అఖిల‌భారత రైతుకూలి సంఘం ఉమ్మడి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అదే కాదు గత నల‌భై ఐదు సంవత్సరాలుగా ఈ రోజు నిజామాబాద్‌ జిల్లాలో దాదాపు 30వేల‌ ఎకరాల్లో సాగు చేసుకుంటున్న భూమిని సాగు చేయనివ్వకుండా, అట్లాగే హైకోర్టు తీర్పు వీలు కల్పించిన కానీ ఈరోజు ఫారెస్ట్‌ అధికారులు అడ్డుకుంటున్నారని, అందుకే వ్యవసాయ వ్యతిరేక చట్టాల‌ను తొల‌గించాల‌ని, పోడు భూముల‌కు పట్టాలు ఇవ్వాల‌ని ఈ నెల‌ 25న జరిగే బహిరంగసభని జిల్లా ప్రజలందరు పాల్గొని విజయవంతం చేయాల‌ని ఆర్మూర్‌ డివిజన్‌ సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ విజ్ఞప్తి చేస్తుందన్నారు.

న్యూడెమోక్రసీ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి యం. ముత్తెన్న, కమ్మర్‌పల్లి కార్యదర్శి యస్‌.సురేష్‌, భీంగల్‌ కార్యదర్శి పి రామకృష్ణ, ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర నాయకులు బి దేవరాం, ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి యన్‌.దాసు, సుర్య శివాజీ రాజేశ్వర్‌, సత్తెక్క, రాజేందర్‌, ఠాకూర్‌, రమేష్‌ గంగారాం, రాజన్న పివైఎల్‌ రాష్ట్ర నాయకులు యం సుమన్‌, పి.డి.యస్‌.యు నాయకులు నరేందర్‌, దుర్గాప్రసాద్‌, అనిల్‌ పాల్గొన్నారు.

Check Also

ఆర్మూర్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా గిరిజన మోర్చా ఆర్మూర్‌ పట్టణ శాఖ ...

Comment on the article