ఆర్మూర్, ఫిబ్రవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపాలిటీలోని మామిడిపల్లికి చెందిన మానస స్వచ్చంద సేవ సంస్థ వ్యవస్థాపకులు మానస గణేష్ నిర్మల్ జిల్లాలోని లోకేశ్వర్లో జరిగిన అమ్మానాన్న ఫౌండేషన్ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో రాష్ట్రస్థాయి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును అందుకున్నారు. అమ్మ నాన్న ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆంజనేయులు, ముధోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, డాక్టర్ నాగరాజు చేతులమీదుగా అవార్డు ప్రదానం జరిగింది.
కోవిడ్ వల్ల రాష్ట్రమంతటా లాక్డౌన్ సమయంలో వలసకూలీలకు నిరుపేదలకు నిత్య అన్నదానం మరియు నిత్యవసర సరుకుల పంపిణీ చేయడం, విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ఆర్థిక సహాయం అందించడం, యువత అసాంఘిక కార్య కలాపాలకు దుర్వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిర్వహించడం లాంటి పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నందుకు గాను అవార్డు లభించినట్లు మానస గణేష్ తెలిపారు.
మానస స్వచ్చంద సేవ సంస్థ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి సంస్థకు రాష్ట్రస్థాయి అవార్డును అందించినందుకు ఆనందంగా ఉందని సంస్థ వ్యవస్థాపకులు మానస గణేష్ అన్నారు. కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీతలు వాల్గోత్ కిషన్, వెంకటాచలం, సామాజికవేత్త సుంకేట్ పోశెట్టి, బిజెపి జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, జెడ్పిటిసి శ్యాంసుందర్ ఎం.పి పీ లలితా, భోజన్న పిఎసిఎస్ చైర్మన్ రమాకాంతరావు తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 15 వరకు ఎం.ఎడ్. పరీక్షల ఫీజు గడువు - March 5, 2021
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021