Breaking News

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని మామిడిపల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై అయ్యప్ప ఆల‌యం వద్ద శనివారం తెల్ల‌వారు జామున గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు మహారాష్ట్రకు చెందిన హర్షల్‌ సురేష్‌ భోంకర్‌ అనే 23 సంవత్సరాల‌ యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు ఎస్‌.ఐ. విజయ్‌ నారాయణ తెలిపారు.

మృతదేహంపై నుంచి భారీ వాహనాలు వెళ్లడంతో తునాతునకలు అయి గుర్తుపట్టలేని విధంగా మారిందని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Check Also

బిజెపి బడా జోకర్‌ పార్టీ

ఆర్మూర్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి పార్టీ అంటే బడా జోకర్‌ పార్టీ అని, ...

Comment on the article