Breaking News

మూడోరోజు సివిల్‌ సప్లయి హమాలీల‌ సమ్మె

కామారెడ్డి, ఫిబ్రవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సివిల్‌ సప్లయి కామారెడ్డి హమాలీ కార్మికులు 15 నిమిషాల‌ పాటు నిరసన వ్యక్తం చేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి మూడవరోజు నిరవధిక సమ్మె సందర్భంగా వినతి పత్రం అందజేశారు.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎల్‌ దశరథ్‌, జిల్లా కార్యదర్శి జి రాజు మాట్లాడుతూ సివిల్‌ సప్లయి హమాలీ కార్మికుల‌ పట్ల రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన రేట్ల జీవోను ఇప్పటివరకు కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటని వారన్నారు. సివిల్‌ సప్లై కమిషనర్‌, పౌరసరఫరాల‌ శాఖ మంత్రి, పౌరసరఫరాల‌ శాఖ చైర్మన్‌ కలిసి చర్చలో భాగంగా హమాలీ కార్మికుల‌ న్యాయమైన డిమాండ్‌ కు తాము సానుకూలంగా ఉన్నామని ఒప్పుకోవడం జరిగింది కానీ నాలుగు నెల‌లు గడిచినా ఇప్పటి వరకు జీవో కాపీ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ భారత రాజ్యాంగంలో పేద మధ్య బల‌హీనవర్గాల‌ వారికి నాణ్యమైన నిత్యావసర సరుకులు అందజేయాల‌ని పొందుపరచడం జరిగిందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కావున సివిల్‌ సప్లై కార్మికుల‌ జీవోను వెంటనే విడుదల‌ చేయాల‌ని లేనియెడల‌ మున్ముందు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికైనా సివిల్‌ సప్లై హమాలీ కార్మికులు వెనుకాడబోమని ధర్నా రాస్తారోకోలు చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు.

కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్ బాలాజీ కృష్ణ, శ్రీకాంత్‌, ఎం శ్రీనివాస్‌, మహేష్‌, గంగరాజు, జి శ్రీనివాస్‌, కే వీరయ్య, నరేష్‌, వీరయ్య. భీమయ్య, నరసయ్య, లింగం, శేఖర్‌, కార్మికులు పాల్గొన్నారు.

Check Also

ఆదర్శం సనత్‌ కుమార్‌ శర్మ

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో ...

Comment on the article