Breaking News

Daily Archives: February 21, 2021

వివాహితపై అత్యాచారం

రెంజల్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం దూపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన జోగు సుమన్‌ అనే యువకుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. గ్రామస్తులు, పోలీసుల‌ కథనం ప్రకారం… వివాహిత భర్త బతుకు దెరువుకోసం మూడేళ్ళ క్రితం దుబాయ్‌కి వెళ్లాడు. అనంతరం వివాహితతో జోగు సుమన్‌కు వివాహేతర సంబంధం, గత కొంతకాలంగా లైంగిక సంబంధం ఏర్పడింది. దుబాయ్‌లో ఉన్న భర్తకు భార్య వ్యవహారం తెలియడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తర్వాత భార్యను వైద్య పరీక్షల‌ ...

Read More »

మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేసిన హమాలీ కార్మికులు

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పాయింట్‌ కామారెడ్డి నందు సివిల్‌ సప్లయి హమాలీ కార్మికులు మోకాల్ల‌పై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సిపిఐ గౌరవ అధ్యక్షుడు వి ఎల్‌ నరసింహారెడ్డి మాట్లాడుతూ సివిల్‌ సప్లై హమాలీ కార్మికుల‌ జీవోను వెంటనే ఇవ్వాల‌ని, ఇఎస్‌ఐ సౌకర్యాన్ని కూడా అమలు చేయాల‌ని పెరిగిన బకాయి రేట్లు జనవరి 1, 2020 నుండి ఇవ్వాల‌న్నారు. కామారెడ్డి జిల్లాలో ఏడు మండల‌ పాయింట్లకు గాను ...

Read More »

కాంగ్రెస్‌లో చేరిన సిపిఐ నాయకుడు

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగాపూర్‌ గ్రామానికి చెందిన సిపిఐ నాయకుడు బండారి రాజిరెడ్డి మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ లో చేరారు. మాజీ సర్పంచ్‌ యాదవరెడ్డి, మాజీ సింగిల్‌ విండో చైర్మన్‌ వైద్య కిషన్‌ రావ్‌, విలెజ్‌ పార్టీ అధ్యక్షుడు బాలిరెడ్డి, మాజీ వార్డ్‌ మేంబర్‌ రాజిరెడ్డి, మీసాల‌ రమేష్‌, జంపాల‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

బడా పహాడ్‌ దర్గాకు చాదర్‌ అందించిన ఎమ్మెల్సీ కవిత

వర్ని, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్నిలోని ప్రసిద్ధ బడా పహాడ్‌ దర్గాకు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత చాదర్‌ అందించారు. దర్గా ప్రతినిధులు, ముస్లిం మతగురువులు ఎమ్మెల్సీ కవితను వారి నివాసంలో కలిశారు. వర్ని మండలంలో గల‌ దర్గాలో జరిగే హజ్రత్‌ సయ్యద్‌ సాదుల్లా హుస్సేనీ షరీఫ్‌ 700వ ఉర్సూ ఉత్సవాల‌కు చాదర్‌ ను సమర్పించనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ నుండి 26 వరకు ఉత్సవాలు జరగనున్నాయి.

Read More »

విహెచ్‌పి, భజరంగ్‌దళ్‌ నాయకుల‌ అరెస్టు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డీకంపల్లి గ్రామంలో ఇటీవల‌ పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి, గ్రామ సభ్యుల‌తో మాట్లాడ‌డానికి విచ్చేస్తున్నటువంటి విహెచ్‌పి రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, బజరంగ్‌ దళ్‌ రాష్ట్ర సంయోజక్‌ సుభాష్‌ చందర్‌ని డీకంపల్లి చేరుకోకుండ మార్గ మధ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం 4 వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వారితో పాటు ఆర్మూర్‌ విహెచ్‌పి, బజరంగ్‌ దళ్‌ కార్యకర్తల‌ను పోలీసు అరెస్ట్‌ చేశారు.

Read More »