Breaking News

మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేసిన హమాలీ కార్మికులు

కామారెడ్డి, ఫిబ్రవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పాయింట్‌ కామారెడ్డి నందు సివిల్‌ సప్లయి హమాలీ కార్మికులు మోకాల్ల‌పై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సిపిఐ గౌరవ అధ్యక్షుడు వి ఎల్‌ నరసింహారెడ్డి మాట్లాడుతూ సివిల్‌ సప్లై హమాలీ కార్మికుల‌ జీవోను వెంటనే ఇవ్వాల‌ని, ఇఎస్‌ఐ సౌకర్యాన్ని కూడా అమలు చేయాల‌ని పెరిగిన బకాయి రేట్లు జనవరి 1, 2020 నుండి ఇవ్వాల‌న్నారు.

కామారెడ్డి జిల్లాలో ఏడు మండల‌ పాయింట్లకు గాను సొంత గోదాములు నిర్మించాల‌ని అదేవిధంగా సివిల్‌ సప్లై హమాలీ కార్మికులు చనిపోయినట్లయితే ఆరు ల‌క్షల‌ ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల‌ని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సివిల్‌ సప్లై హమాలీ కార్మికుల‌ ఎగుమతి దిగుమతి ధరల‌ జీవోను రెండు మూడు రోజుల్లో ఇవ్వక పోయినట్లయితే ఎలాంటి ఆందోళన కార్యక్రమాల‌కైనా వెనుకాడబోమని పేర్కొన్నారు.

హమాలీ కార్మికుల‌ పట్ల ప్రభుత్వం ఎందుకు మొండివైఖరి వహిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఎల్‌ దశరథ్‌, కార్యదర్శి జి రాజు, సంపత్‌ కృష్ణ, బాజీ శ్రీనివాస్‌, శ్రీను, శ్రీకాంత్‌, నరేష్‌, శేఖర్‌, వీరయ్య, నరసయ్య, వీరయ్య, గంగరాజు, భీమయ్య, శేఖర్‌, మహేష్‌ కార్మికులు పాల్గొన్నారు.

Check Also

మూడోరోజు సివిల్‌ సప్లయి హమాలీల‌ సమ్మె

కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సివిల్‌ సప్లయి కామారెడ్డి ...

Comment on the article