Breaking News

వివాహితపై అత్యాచారం

రెంజల్‌, ఫిబ్రవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం దూపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన జోగు సుమన్‌ అనే యువకుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. గ్రామస్తులు, పోలీసుల‌ కథనం ప్రకారం… వివాహిత భర్త బతుకు దెరువుకోసం మూడేళ్ళ క్రితం దుబాయ్‌కి వెళ్లాడు. అనంతరం వివాహితతో జోగు సుమన్‌కు వివాహేతర సంబంధం, గత కొంతకాలంగా లైంగిక సంబంధం ఏర్పడింది.

దుబాయ్‌లో ఉన్న భర్తకు భార్య వ్యవహారం తెలియడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తర్వాత భార్యను వైద్య పరీక్షల‌ నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. భార్య గర్భం దాల్చిందని వైద్యులు నిర్ధారించడంతో భర్త అవాక్కయ్యాడు. చివరికి వివాహిత సుమన్‌పై రెంజల్‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆదివారం బోధన్‌ రూరల్‌ సిఐ రవీందర్‌ నాయక్‌ గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. అత్యాచారానికి పాల్ప‌డిన సుమన్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Check Also

మోడల్‌ పాఠశాల‌లో సైన్స్‌ దినోత్సవం

రెంజల్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల‌ కేంద్రంలోని మోడల్‌ పాఠశాల‌లో జాతీయ సైన్సు దినోత్సవాన్ని ...

Comment on the article