Breaking News

ఫోన్‌ ఇన్‌లో 38, ప్రజావాణిలో 58 ఫిర్యాదులు

కామారెడ్డి, ఫిబ్రవరి 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా 38 ఫిర్యాదుల‌ను కామారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి చంద్ర మోహన్‌ రెడ్డి స్వీకరించారు. అలాగే ప్రజావాణి ద్వారా 58 దరఖాస్తులు స్వీకరించారు. ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా అందినవాటిలో రెవిన్యూ 18, జిల్లా పంచాయితీ కార్యాల‌యం 13, జిల్లా లీడ్‌ బ్యాంక్‌ 2, విద్యాశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌, నీటిపారుదల‌, వ్యవసాయ, విద్యుత్‌ శాఖకు ఒక్కొక్క ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు.

ప్రజావాణి ద్వారా అందినవాటిలో రెవిన్యూ 38, జిల్లా పంచాయితీ కార్యాల‌యం 7, వైద్యశాఖ 2, పోలీసు 3, ఫారెస్టు 2, విద్యుత్‌ 2, విద్యాశాఖ, కామారెడ్డి మున్సిపాలిటీ సాంఘిక సంక్షేమం, ఎంప్లాయ్‌ మెంట్‌ శాఖలు ఒకొక్కటి చొప్పున ఉన్నాయన్నారు. ఫోన్‌ ఇన్‌, ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

మూడోరోజు సివిల్‌ సప్లయి హమాలీల‌ సమ్మె

కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సివిల్‌ సప్లయి కామారెడ్డి ...

Comment on the article