డిచ్పల్లి, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర మరియు బాలికల హాస్టల్స్‌ను చీఫ్ వార్డెన్ డా. జమీల్ అహ్మద్ నేతృత్వంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు డా. వాసం చంద్రశేఖర్ సోమవారం మధ్యాహ్నం పర్యవేక్షించారు.
కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్న కారణంగా ప్రధానాచార్యులు హాస్టల్స్‌లో ఉన్న విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవసిందిగా సూచించారు. హాస్టల్ గదులలో పరిశుభ్రత మరియు నిర్ణీత దూరంతో మెలగడం, పరిసర ప్రదేశాల్లో భౌతిక దూరంతో సంచరించడం మరియు శానిటైజేషన్ చేయడం, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం వంటివి విధిగా పాటించాలన్నారు.
భోజనశాలలో అత్యంత జాగ్రత్త వహిస్తూ, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. హాస్టల్ విద్యార్థులు, సిబ్బంది కొవిద్ -19 నిబంధనలను తప్పక అనుసరించాలని కోరారు. పర్యవేక్షణలో వార్డెన్ డా.వి. పార్వతి, ఈసీ మెంబర్ డా.కె.రవీందర్ రెడ్డి, అకడమిక్ కన్సల్టెంట్ డా.దత్తహరి, కేర్ టెకర్స్ జమునా రాణి, క్రాంతి కుమార్, దిగంబర్ చౌహాన్, సిబ్బంది గులాబ్, నవీన్ తదితరులు ఉన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తిచేయాలి - February 26, 2021
- బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి - February 26, 2021
- పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి - February 26, 2021