Breaking News

స్వాతంత్య్ర సమరయోధుడు మృతి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు మట్టిలో మాణిక్యం, స్వతంత్ర సమరయోధుడు, నిజాం రజాకార్లను ఇందూరు గడ్డ నుండి తరిమికొట్టేందుకు జరిగిన పోరాటంలో ముందు వరుసలో ఉన్న ఉద్యమకారుడు, దేశ భక్తి, ధర్మ నిష్టను ఆచరణలో చూపిన పుణ్య మూర్తి అంబటి శంకర్‌ (95) ఆదివారం సాయంత్రం స్వర్గస్తుయ్యారు.

నిజామాబాద్‌ జిల్లా కేంద్రం, కోటగల్లి వాస్తవ్యులు అంబటి శంకర్‌ చిన్ననాటినుంచే దేశభక్తి, ధర్మనిష్ట కలిగి ఆర్యసమాజంలో క్రియాశీల‌ సభ్యునిగా పనిచేశారు. వృద్దాప్యంలో సైతం చిన్నారుల‌ను చేరదీసి దేశనాయకుల కథలు, ఉద్యమ గాథలు చెబుతూ వారిలో దేశభక్తిని పెంపొందించారు.

స్వతంత్ర సమరయోధుల‌కు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ను తిరస్కరించారు. నా తల్లి కి నేను సేవ చేసాను దానికి నాకు డబ్బు చెల్లిస్తారా, అది నా బాధ్యత అని రొమ్ము విరిచి చాటిచెప్పిన తల్లి భారతి ముద్దు బిడ్డ అంబటి శంకర్‌. వారి జీవితం ఎంతోమందికి ఆదర్శం. సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబీకులు పేర్కొన్నారు.

Check Also

భీమ్‌గల్‌ బార్‌ దక్కించుకున్న బద్దం రాకేశ్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మునిసిపాలిటీలో కొత్తగా నోటిఫై చేయబడిన ...

Comment on the article