నిజామాబాద్, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్.ఇన్.
టీఎస్ ఐపాస్ అనుమతుల కోసం వచ్చే ఔత్సాహికులకు సరైన అవగాహనతో సలహాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
సోమవారం క్యాంప్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ , టీఎస్ ఐపాస్ పై సమావేశం నిర్వహించి అనుమతులకు ఆమోదం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు సరైన దిశ- నిర్దేశం చేయడంతోపాటు, వీలైనంత త్వరగా అనుమతులు లభించడానికి అవసరమైన సలహాలు సూచనలు అందించాలని, వారిని ప్రోత్సహించాలని ఆదేశించారు. అదేవిధంగా స్వయం ఉపాధి, ఇతర పరిశ్రమల ఏర్పాటు కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి అవసరమైన అన్ని శాఖల అనుమతులతో పాటు సబ్సిడీని కూడా సకాలంలో అందించాలని పేర్కొన్నారు.
స్వయం ఉపాధి కింద రుణాలు పొందే ఎస్సీలకు, ఎస్టీలకు 35 శాతం సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాలను ఎస్సీ , ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సమావేశంలో 15 మంది ఎస్సీలకు ట్రాక్టర్ అండ్ ట్రైలర్ వెహికల్ మంజూరు చేశారు. 17 మంది ఎస్టీలకు 16 ట్రాక్టర్ అండ్ ట్రైలర్, 01 గూడ్స్ వెహికల్ సంబంధించి మైక్రో యూనిట్ మంజూరు చేయుటకు 35 శాతం సబ్సిడీకి ఆమోదం తెలిపామన్నారు.
అనుమతులకు రవాణా, పొల్యూషన్ కంట్రోల్ ఇతర శాఖల అనుమతులు కూడా ఎప్పటికప్పుడు నిర్ణీత సమయంలో జారీ చేయుటకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని మరోవైపు ప్రభుత్వ నిబంధనలు కూడా పాటించాలని ఆయన ఆదేశించారు.
సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బాబురావు , ఎల్ డి ఎం జయ సంతోషి, పిసిబి ఈఈ బిక్షపతి, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తిచేయాలి - February 26, 2021
- బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి - February 26, 2021
- పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి - February 26, 2021