ఆర్మూర్, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా ఆహార వ్యవస్థను దెబ్బతీసే 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో 25 ఫిబ్రవరిన జరిగే సభను జయప్రదం చేయాలని ఐ.ఎఫ్.టి.యు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కార్మికులకు కోరారు.
కోటార్మూర్ గ్రామంలో దేవంగా సంఘములో బీడీ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఐ.ఎఫ్.టి.యు జిల్లా నాయకులు శివాజీ మాట్లాడుతూ, మోడీ బీడీ పరిశ్రమను దెబ్బతీసే విధానాలు విడనాడాలని, కెసిఆర్ కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని, బీడీ కార్మికులు అందరికీ జీవనభృతి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ నాయకులు రాజ్యలక్ష్మి, గంగామణి, గోదావరి, రవి, హరి ప్రసాద్, పెద్ద నరసయ్య, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తిచేయాలి - February 26, 2021
- బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి - February 26, 2021
- పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి - February 26, 2021