కామారెడ్డి, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాగమడుగు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.476 కోట్ల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు, గ ృహ నిర్మాణ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలం మహమ్మద్ నగర్లో సోమవారం గ్రామ పంచాయతీ భవనం, రైతు వేదిక, సహకార సంఘం అదనపు గదులకు ప్రారంభోత్సవం చేశారు. కళ్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నాగ మడుగు ప్రాజెక్ట్ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు వస్తారని చెప్పారు. ప్రాజెక్టు ద్వారా 28 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. కొండ పోచంపల్లి నుంచి హల్ది వాగు ద్వారా నిజాంసాగర్‌కు త్వరలో సాగు నీరు వస్తుందని, నిజాంసాగర్ ఆయకట్టు కింద రెండు పంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపారు. జుక్కల్ నియోజకవర్గానికి ఐదు వేల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
రైతు క్షేమం దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి పంట పెట్టుబడి సాయం, బీమా పథకాలు అమలు చేసి రైతు ఉన్నతికి చేయూతను ఇస్తున్నారని పేర్కొన్నారు. రైతుకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను తమ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శోభారాజు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతు బాగుండాలనే ఉద్దేశంతో క్లస్టర్ల వారీగా రైతు వేదిక భవనాలను నిర్మించిందని చెప్పారు. రైతులు తమ భూముల్లో పండే పంటలను చర్చించుకొని లాభదాయకమైన పంటలు పండిరచుకోవాలని కోరారు.
నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చాలని పేర్కొన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పలు సంక్షేమ పథకాలు ప్రారంభించారని పేర్కొన్నారు. పింఛన్లు, రేషన్ బియ్యం, పెట్టుబడి రాయితీ వంటి అనేక పథకాలను ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. జుక్కల్ నియోజకవర్గంలో 10 వేల 700 మంది రైతులకు 8 కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీ వచ్చిందని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డిఓ రాజాగౌడ్, ఎంపీపీ జ్యోతి, మాజీ జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, సర్పంచ్ బాలమణి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తిచేయాలి - February 26, 2021
- బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి - February 26, 2021
- పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి - February 26, 2021