Breaking News

Daily Archives: February 23, 2021

కలెక్టర్‌ సహకారంతోనే ఒత్తిడి లేని విధులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రణాళిక శాఖ సంచాల‌కులుగా పదోన్నతిపై వెళుతున్న ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీరాములును జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఇతర అధికారులు శాలువాతో సత్కరించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక నిధుల‌ సమావేశం అనంతరం కలెక్టర్‌ ఆయనను సత్కరించిన సందర్బంగా సిపిఓ మాట్లాడారు. ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు సల‌హాలు అందిస్తూ పూర్తి సహకారం అందించాల‌ని తద్వారానే తాను ఒత్తిడిలేని విధుల‌ను నిర్వహించ గలిగానని అందుకు ఎల్ల‌ప్పుడు కృతజ్ఞతతో ఉంటానని తెలిపారు. ఇంతకాలంగా తనకు ...

Read More »

మే చివరికల్లా పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక నిధుల‌తో చేపట్టిన పనులు మే చివరికల్లా తప్పనిసరిగా పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరములో సిడిపి, ఎస్‌డిపి, ఎంపి లాడ్స్‌, రెండు పడక గదుల‌ ఇళ్ళు, ఇతర నిర్మాణ పనుల‌పై పి ఆర్‌., ఆర్‌అండ్‌బి శాఖ అధికారుల‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రోగ్రెస్‌లో ఉన్న వర్క్స్‌ మార్చ్‌ 31 వరకు ...

Read More »

గుంజపడుగుకు తరలిన కామారెడ్డి న్యాయవాదులు

కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంథనిలో హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణిల‌ హత్యకు నిరసనగా ఆందోళన నిర్వహించడానికి, వారి కుటుంబ సభ్యుల‌ను పరామర్శించి సంఫీుభావం తెలియజేయడానికి కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం వామనరావు స్వగ్రామమైన గుంజపడుగు తరలివెళ్లారు. ఈ సందర్బంగా అసోసియేషన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ న్యాయవాద దంపతుల‌ హత్యపై సీబీఐ విచారణ చేపట్టాల‌ని, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్ట్‌ ఏర్పాటు చేయాల‌ని, వారి కుటుంబానికి ఐదు కోట్ల నష్ట పరిహారం చెల్లించాల‌ని, హత్యతో సంబంధం ఉన్న ...

Read More »

ఘనంగా సంత్‌ గాడ్గే బాబా జయంతి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రజక సంఘాల‌ సమితి రాష్ట్ర కన్వీనర్‌ మానస గణేష్‌ ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త సంత్‌ గాడ్గే బాబా 145 వ జయంతిని లాల‌న‌ వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. మానస గణేష్‌ మాట్లాడుతూ సంత్‌ గాడ్గే బాబా నిరుపేదల‌ కోసం మహారాష్ట్రలో 143 పాఠశాల‌లు నిర్మించిన మహానీయుడని కొనియాడారు. స్వాతంత్య్రానికి పూర్వమే స్వఛ్ఛత కార్యక్రమానికి నాంది పలికి పరిశుభ్రత పరమాత్ముడు అని నినదించిన ఆయన స్వఛ్ఛత పితామహుడు అన్నారు. ఆకలికి అల‌మటించే వారికోసం ...

Read More »

25న ఛలో నిజామాబాద్‌

ఆర్మూర్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాల‌కు నిరసనగా ఈనెల‌ 25 న చలో నిజామాబాద్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల‌ని ఐ.ఎఫ్‌.టి.యు నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కార్మికుల‌ను కోరారు. దేశ ప్రజల‌ ఆహార భద్రతకు ముప్పు కలిగించే మూడు వ్యవసాయ చట్టాల‌ను విద్యుత్ బిల్లును రద్దు చేయాల‌ని, కార్మిక హక్కుల‌ను హరించే చట్టాల‌ సవరణ ఆపాల‌ని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు ...

Read More »

గుంజపడుగకు బయలుదేరిన న్యాయవాదులు‌

బోధన్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం బోధన్‌ న్యాయవాదులు గుంజపడుగకు బయల్దేరారు. అతి క్రూరంగా నరికి హత్య చేయ‌బ‌డిన‌ న్యాయవాద దంపతులైన వామన్‌ రావ్‌ మరియు నాగమణిల‌ను హత్య చేసిన కిరాతకుల‌ను వెంటనే ఉరిశిక్ష వేసి, న్యాయవాద పరిరక్షణ చట్టం, తెచ్చి న్యాయవాదుల‌కు రక్షణ కల్పించాల‌ని డిమాండ్‌ చేశారు. వామన్‌రావు కుటుంబీకుల‌కు సంఫీుభావం తెలుపుటకు బోధన్‌ న్యాయవాదులు మొహమ్మద్‌ మోహిమూద్‌, అర్జున్‌ రాండర్‌, ఈశ్వర్‌, సమ్మయ్య, వాజీద్‌ హుస్సేన్‌, రవీందర్‌, ఖాసీం బాషా, రాహుల్‌, ధర్మయ్య, అజయ్‌, కోటేశ్వరరావు, ...

Read More »