ఆర్మూర్, ఫిబ్రవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర కన్వీనర్ మానస గణేష్ ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త సంత్ గాడ్గే బాబా 145 వ జయంతిని లాలన వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. మానస గణేష్ మాట్లాడుతూ సంత్ గాడ్గే బాబా నిరుపేదల కోసం మహారాష్ట్రలో 143 పాఠశాలలు నిర్మించిన మహానీయుడని కొనియాడారు.
స్వాతంత్య్రానికి పూర్వమే స్వఛ్ఛత కార్యక్రమానికి నాంది పలికి పరిశుభ్రత పరమాత్ముడు అని నినదించిన ఆయన స్వఛ్ఛత పితామహుడు అన్నారు. ఆకలికి అలమటించే వారికోసం అన్న సత్రాలు నిరాశ్రయుల కోసం ఆశ్రమాలు సమానత్వాన్ని చాటిచెప్పే సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసిన సామాజికవేత్త నేటి యువత ఆదర్శంగా తీసుకొని ఆయన చూపిన బాటలో నడవాలని అన్నారు.
కార్యక్రమానికి ముందుగా గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన అధ్యక్షుడు మీరా శ్రవణ్, ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షుడు మీరా హనుమంతు, సంగం మలేష్, బాజామొల్ల నరేష్ మాక్లూర్ రాజు, దత్తపురం చింటూ, చల్లగరిగె విజయ్, చల్లగరిగె యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తిచేయాలి - February 26, 2021
- బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి - February 26, 2021
- పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి - February 26, 2021