Breaking News

గుంజపడుగుకు తరలిన కామారెడ్డి న్యాయవాదులు

కామారెడ్డి, ఫిబ్రవరి 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంథనిలో హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణిల‌ హత్యకు నిరసనగా ఆందోళన నిర్వహించడానికి, వారి కుటుంబ సభ్యుల‌ను పరామర్శించి సంఫీుభావం తెలియజేయడానికి కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం వామనరావు స్వగ్రామమైన గుంజపడుగు తరలివెళ్లారు.

ఈ సందర్బంగా అసోసియేషన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ న్యాయవాద దంపతుల‌ హత్యపై సీబీఐ విచారణ చేపట్టాల‌ని, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్ట్‌ ఏర్పాటు చేయాల‌ని, వారి కుటుంబానికి ఐదు కోట్ల నష్ట పరిహారం చెల్లించాల‌ని, హత్యతో సంబంధం ఉన్న అసలు సూత్రదారుల‌ను అరెస్టు చేయాల‌ని డిమాండ్‌ చేశారు. న్యాయవాదుల‌పై జరుగుతున్న దాడుల‌ను అరికట్టాల‌ని, అడ్వొకేట్‌ ప్రోటక్షన్‌ యాక్ట్‌ తీసుకురావాల‌ని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ల‌క్ష్మన్‌ రావు, సురేందర్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీధర్‌, ప్రతినిధులు నర్సింహారెడ్డి, జగన్నాథం, శంకర్‌ రెడ్డి, వెంకట్రాంరెడ్డి, చంద్రశేఖర్‌, దామోదర్‌ రెడ్డి, మహబూబ్‌ అలీ, దేవరాజ్‌ గౌడ్‌, అమృత్‌ రావు, చింత గోపి, గోవింద్‌ రావు, భిక్షపతి, శ్రీకాంత్‌ గౌడ్‌, బి.నారాయణ, సలీం, గంగాధర్‌, జి.శ్రీనివాస్‌, కె.శ్రీనివాస్‌, మాక్సుద్‌, మోహన్‌ రెడ్డి, గంగరాజ్‌, స్టీఫెన్‌ రాజ్‌, అంగ్‌ రాజ్‌, రజినీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article