ఆర్మూర్, ఫిబ్రవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 25 న చలో నిజామాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐ.ఎఫ్.టి.యు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కార్మికులను కోరారు. దేశ ప్రజల ఆహార భద్రతకు ముప్పు కలిగించే మూడు వ్యవసాయ చట్టాలను విద్యుత్ బిల్లును రద్దు చేయాలని, కార్మిక హక్కులను హరించే చట్టాల సవరణ ఆపాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని దాసు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు డబుల్ బెడ్రూం పథకాన్ని వెంటనే అమలు చేయాలని, సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, పంచాయతీ, మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు రాసలక్ష్మీనారాయణ, నగేష్, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ వేల్పూరు మండల అధ్యక్ష కార్యదర్శులు వెంకటాపూర్ గంగారం, నారాయణ, నరసింహులు, ఎంకమ్మ, భాగ్య, సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తిచేయాలి - February 26, 2021
- బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి - February 26, 2021
- పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి - February 26, 2021