Breaking News

26లోగా పూర్తి చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 26 లోగా కస్టమ్‌ మిల్లింగ్‌ రైన్‌ (సిఎంఆర్‌) పూర్తి చేయాల‌ని జిల్లాకలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ రైస్ మిల్ల‌ర్‌ల‌ను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో సిఎంఆర్‌పై సమీక్షిస్తూ, ఇంకా పది వేల‌ మెట్రిక్‌ టన్నులు మిగిలివుందని, ఈనెల‌ 26 లోగా పూర్తి చేసి ఎన్‌సిఐకి అందచేయాల‌ని రైస్ మిల్ల‌ర్‌ల‌ను ఆదేశించారు.

అనంతరం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ పరిస్థితిపై అధికారుల‌తో ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్‌ కలెక్టరు హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, డిఎం సిఏల్‌ సప్లయ్స్‌ జితేంద్ర ప్రసాద్‌, జిల్లా సరఫరాల‌ అధికారి కొండల‌రావు, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యల‌క్ష్మి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి రమ్య, తదితరులు పాల్గొన్నారు.

Check Also

చత్తీస్‌ఘడ్‌ అమర జవాన్లకు నివాళి

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్తీస్‌ ఘడ్‌ బీజాపూర్‌లోని మావోయిస్టుల‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర ...

Comment on the article