Breaking News

వన్నెల్‌ (బి)లో పోలీసు కళాజాత

బాల్కొండ, ఫిబ్రవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల‌ మేరకు పోలీసు కళా జాతా కార్యక్రమం బాల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వన్నెల్‌(బి) గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల‌ కోసము పలు సూచనలు, సల‌హాలు అందజేశారు. ట్రాఫిక్‌ నిబంధనల‌ను పాటించాల‌ని, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని వాటిని పర్యవెక్షించాల‌ని సూచించారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ లేకుండా ప్రయాణించరాదని, ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తప్పకుండా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాల‌ని చెప్పారు. మోసపూరిత ప్రకటనల‌ను నమ్మవద్దని, అట్టి ప్రకటనల‌ను చూసి బ్యాంక్‌ సమాచారం/ ఏటిఎం కార్డ్‌ సమాచారం ఇవ్వకూడదన్నారు. మహిళల‌ రక్షణ కోసము 24 గంటలు షి టీమ్‌ ఉపయోగించే విధానము, షి టీమ్‌ నెంబర్‌ 9490618029 ఉపయోగించుకోవాల‌ని, సైబర్‌ నేరాల‌ గురించి అప్రమత్తంగా ఉండాల‌ని వివరించారు.

గ్రామములో మూడ నమ్మకాలు నమ్మవద్దని, నకిలీ గల్ఫ్‌ ఏజెంట్‌ మోసాల‌ గురించి జాగ్రత్త వహించాల‌ని, హెల్మెట్‌ బరువు కాదు బాధ్యత అని గుర్తుచేశారు. ఆన్‌లైన్‌ మోసాల‌ గురించి అప్రమత్తంగా ఉండాల‌ని మొదల‌గు వాటి గురించి క్షుణ్ణంగా నాటక రూపంలో వివరించారు. కార్యక్రమంలో బాల్కొండ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ రాఘవేందర్‌, గ్రామ సర్పంచ్‌ నాగుల‌పల్లి భూదేవి కిషన్‌, ఉప సర్పంచ్‌- నాగుల‌పల్లి కిషన్‌, ఎంపిటిసి సభ్యులు- గంగసరం భోజెందర్‌, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Check Also

రేపు భారత్‌ బంద్‌

ఆర్మూర్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల‌ను మరియు జాతీయ ...

Comment on the article