కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైకుంఠధామాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ పంచాయితీ రాజ్ అధికారులను ఆదేశించారు. శుకవారం జనహిత భవన్లో ఆర్డిఓలు, పంచాయితీరాజ్ ఇంజనీర్లతో వైకుంఠధామం పనులను మండలాల వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠధామాలలో మిగిలిన లక్ష్యాన్ని వెంటనే పూర్తి అయ్యేలా క్షేత్రస్థాయిలో ఎఇ, డిఇలు పర్యవేక్షించాలని ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ పనులకు సంబంధించి ఇసుక కొరత లేదని, ఆర్డిఓల సహకారంతో ఇసుక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ...
Read More »Daily Archives: February 26, 2021
బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి
కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషిచేస్తామని డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శరత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బాల రక్ష భవన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల్యవివాహాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తామన్నారు. బాలికలపై రోజురోజుకు వేధింపులు పెరిగిపోతున్నాయని, వాటిని నియంత్రించేందుకు కమిటి పనిచేస్తుందన్నారు. పసికందులను విక్రయించడం, అనధికారిక దత్తతను తీసుకోవడం నేరమని అలాంటివి ఎక్కడైనా జరిగితే ...
Read More »పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి
కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం నరసన్నపల్లిలో నీటి దినోత్సవంలో భాగంగా శుక్రవారం అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలకు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే నీళ్లు పట్టారు. నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. నర్సరీలో మొక్కలు సక్రమంగా లేనందున పంచాయతీ కార్యదర్శి నవనీతపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More »తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కో ఆర్డినేటర్‌గా డి.యల్.యన్.చారి
నిజామాబాద్, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1993 నుండి 2014 తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు అలుపెరుగని పోరాటం చేసిన, తెలంగాణ ఉద్యమం అనుభవం ఉన్న వ్యక్తి నిజామాబాద్ జిల్లా కో ఆర్డినేటర్‌గా నియమించడం రాష్ట్ర కమిటిలో మంచి పరిణామమని రాష్ట్ర కమిటీ నాయకులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఫోరమ్ రాష్ట్ర కమిటీ ఛైర్మన్ డా. చీమల శ్రీనివాస్ చేతులమీదుగా నియామక పత్రాన్ని డి.యల్.యన్.చారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను స్వతంత్ర ...
Read More »ప్రఖండ దేశభక్తుడు వీర సావర్కర్
ఆర్మూర్, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినాయక దామోదర వీర సావర్కర్ 55 వ వర్ధంతిని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్లొ నిర్వహించారు. వీర సావర్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణ బిజెపి అధ్యక్షుడు జెస్సు అనిల్ కుమార్, భారతీయ జనతా కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు పాలెపు రాజ్ కుమార్ు మాట్లాడుతు వినాయక దామోదర్ సావర్కర్ ఓ ప్రఖంఢ దేశభక్తుడని, ...
Read More »ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం – న్యాయవాదుల నిరసన
నిజామాబాద్, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైకోర్టు న్యాయవాదులు వామనరావ్ నాగమణి దంపతుల జంట హత్యలను నిరసిస్తూ తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషస్స్ పిలుపుమేరకు ఆందోళనలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రధాన గేటు ఎదుట న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచి కట్ల గోవర్థన్ మాట్లాడుతూ న్యాయవాదుల హత్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పటికైనా సిబిఐ చేత విచారణ జరిపించాలని ...
Read More »