కామారెడ్డి, ఫిబ్రవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ శివారులోని వృద్ద ఆశ్రమంలో నిర్వహించిన గ్రామీణ వయోవృద్ధుల మేళా 2021 కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులకు పోషక అవసరాలను తమ పిల్లలు తీర్చాలని కోరారు.
వృద్ధుల సమస్యలను తమ పిల్లలు తీర్చకపోతే గ్రామ పంచాయతీ పాలక వర్గం దృష్టికి తెచ్చి సమస్యను పరిష్కరించేందుకు గ్రామ పంచాయతీ పాలక వర్గంలో ఇద్దరు వృద్ధులను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధుల సమస్యల పరిష్కారంలో అధికారుల సహకారంతో సమస్యలు తీర్చేందుకు తన వంతు సహకారం అందజేస్తానని అన్నారు. కార్యక్రమంలో పలువురు అదికారులు, నాయకులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు - April 16, 2021
- నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్ - April 16, 2021
- మహిళల భద్రతకై క్యూ.ఆర్.కోడ్ - April 16, 2021