డిచ్పల్లి, మార్చ్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఐక్యూఎసీ డైరెక్టర్‌గా ఆచార్య కౌసర్ మహ్మద్ నియమితులయ్యారు. ఉపకులపతి నీతూ కుమారి ప్రసాద్ ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య నసీం నియామక ఉత్తర్వులను మంగళవారం ఆచార్య కౌసర్ మహ్మద్‌కు అందించారు. కాగా ఇప్పటి వరకు ఐక్యూఎసీ డైరెక్టర్‌గా ఆచార్య అత్తర్ సుల్తానా కొనసాగారు.
ఆచార్య కౌసర్ మహ్మద్ ఇదివరకు ఐక్యూఎసీ డైరెక్టర్‌గా, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ అండ్ బి.ఎడ్. కళాశాల ప్రిన్సిపల్ గా, ప్లేస్ మెంట్ సెల్ డైరెక్టర్‌గా, ఇంఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్‌గా, బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగానికి విభాగాధిపతిగా, బిఓఎస్గా పలు అడ్మినిస్ట్రేషన్ అండ్ అకడమిక్ పదవులు నిర్వర్తించారు.
తనపై నమ్మకంతో ఐక్యూఎసీ డైరెక్టర్‌గా నియమించిన వీసీ అండ్ రిజిస్ట్రార్‌కు ఆచార్య కౌసర్ మహ్మద్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆచార్య కౌసర్ మహ్మద్‌కు పలువురు అధ్యాపకులు, అధ్యాపకేతరులు అభినందనలు తెలిపారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు - April 16, 2021
- నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్ - April 16, 2021
- మహిళల భద్రతకై క్యూ.ఆర్.కోడ్ - April 16, 2021