డిచ్పల్లి, మార్చ్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగానికి చెందిన ఆచార్యులు డా. కౌసర్ మహ్మద్ మరియు అకడమిక్ కన్సల్టెంట్ డా. ఆలోక్ రాజ్ భట్ సంయుక్తంగా రచించిన ‘‘డైరెక్ట్ టాక్షెస్ – ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్’’ అనే పుస్తకాన్ని మంగళవారం రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ గ్రంథం భారతదేశంలోని అన్ని విద్యాసంస్థలలో గల బి.కాం., ఎం.కాం., బి.బి.ఎ., ఐ.ఎం.బి.ఎ., ఎం.బి.ఎ. కోర్సులకు ఉపయుక్తమైన పాఠ్య గ్రంథమని తెలిపారు. పుస్తకంలో అత్యంత క్లిష్టమైన డైరెక్ట్ టాక్షెస్కు సంబంధించిన నాలుగు అధ్యాయాలు ఉన్నాయన్నారు. అగ్రికల్చర్ ఇన్ కం, ఇన్ కం ఫ్రం సాలరీ, ఇన్ కం ఫ్రం హౌస్ ప్రాపర్టీస్, ప్రాఫిట్ అండ్ గేంస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనే అంశాలపై సమగ్రమైన ఆదాయ పన్ను వివరాలు ఉన్నాయన్నారు. డా. అలోక్ రాజ్ భట్ వివిధ ఆదాయ నమూనాలను సేకరించి ప్రత్యక్షంగా టాక్షెస్ను గుణించారని పేర్కొన్నారు.
పుస్తక రచయితను తన తరఫున, ఉపకులపతి నీతూ కుమారి ప్రసాద్ తరఫున ప్రత్యేకంగా అభినందించారు. అధ్యాపకులు తమ పరిశోధనా రంగాన్ని విస్తృత పరుచుకొని పుస్తక రచన గావించాలని కోరారు. కార్యక్రమంలో బిజినెస్ మేనేజ్ మేంట్ అధ్యాపకులు డా.రాజేశ్వరి, డా.అపర్ణ, డా.ఆంజనేయులు, డా.వాణి, కిరణ్ రాథోడ్, ఇతర విభాగాల అధ్యాపకులు ఆచార్య అత్తర్ సుల్తానా, డా.అథిక్ సుల్తాన్ ఘోరి, డా.మూసా ఖురేషి తదితరులు పాల్గొన్నాను. ఇతర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు - April 16, 2021
- నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్ - April 16, 2021
- మహిళల భద్రతకై క్యూ.ఆర్.కోడ్ - April 16, 2021