నిజామాబాద్, మార్చ్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ మండల స్థాయి అధికారులతో కోవిడ్, ఎన్ఆర్ఈజీఎస్. డ్రయింగ్ ఫ్లాట్ఫామ్స్, క్రిమటోరీయం, హరితహారం, కంపోస్టు షెడ్స్, రైతు వేదికలపై ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీఓలు, డీఎల్పీవోలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సదర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిన్నటి నుంచి రెండు కేటగిరీల వారికి మూడు సెంటర్లలో వ్యాక్సిన్ ఇస్తున్నామని, రానున్న రోజుల్లో పిహెచ్సి లెవెల్ నుండి ఇస్తామన్నారు.
60 సంవత్సరాల పైబడిన వారు 45 నుండి 59 సంవత్సరాలవారు బీపీ షుగర్ ఉన్నవారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా, ప్రైవేటు రెండు హాస్పిటల్ ప్రగతి, మెడికవర్ హాస్పిటల్లో 250 రూపాయలకు ఇస్తున్నామన్నారు. అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, సీనియర్ సిటిజెన్లకు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి టీకా తీసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్, ఎండాకాలంలో అన్ని గ్రామ పంచాయతీలలో రోజుకు 50 మంది చొప్పున మార్చి నెలలో లేబర్ పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ నుంచి వంద శాతం లేబర్ టర్నవుట్ పెరగాలన్నారు.
ఈ సంవత్సరం టార్గెట్ రీచ్ కావాలన్నారు. ఇందల్వాయి మండలంలో వంద శాతం లేబర్ పని చేస్తున్నందుకు ఎంపీడీవోలను అభినందించారు. ప్రతి జిపిలో వర్క్ జరగాలన్నారు. మేట్లు, పంచాయతీ సెక్రటరీలు గట్టిగా పనిచేయాలన్నారు. డ్రైయింగ్ ప్లాట్పామ్స్ ఈ నెల 31 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. వీటిని కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న వారి ప్రపోజల్స్ పంపాలన్నారు. శాంక్షన్ అయినవి పూర్తి చేయాలన్నారు. వైకుంఠ ధామాలు పెండింగ్ ఉన్నవి పూర్తి చేయాలన్నారు. వచ్చే హరితహారంకు నర్సరీలో మొక్కలు ఉండాలన్నారు. సీడ్ జన రేషన్ వంద శాతం ఉండాలన్నారు.
నెల చివరి వరకు టార్గెట్ పూర్తి కావాలన్నారు. గ్రామ పంచాయతీలలో గ్రామ కమిటీ నిర్ణయించిన సీడ్ పెట్టాలన్నారు. హరిత హారంలో నాటిన మొక్కలకు రోజూ వాటరింగ్ చేయాలన్నారు. కంపోస్టు షెడ్ గ్రామ పంచాయతీలలో తప్పక వాడాలని సూచించారు. చెత్త సేకరించి ప్రాసెస్ చేయాలన్నారు. గతనెల 17 న నాటిన మొక్కలు ఏ విధంగా ఉన్నాయో చూస్తామన్నారు.
ఎకనామిక్ సపోర్టు స్కీమ్ కింద 50 వేల రూపాయలు, సబ్సిడీ కింద పిడబ్ల్యుడి దరఖాస్తులు ఆన్లైన్లో రేపటిలోగా పంపాలన్నారు. ప్రాపర్టీ టాక్స్ జిపి వారిగా 28 మార్చి వరకు వంద శాతం పూర్తి కావాలని పేర్కొన్నారు. వచ్చేవారం 75 శాతం చేరుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో డిఆర్డిఓ శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈవో గోవింద్, డిపిఓ జయసుధ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు - April 16, 2021
- నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్ - April 16, 2021
- మహిళల భద్రతకై క్యూ.ఆర్.కోడ్ - April 16, 2021