ఆర్మూర్, మార్చ్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు సోమవారం కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగపూర్ గ్రామంలో పోలీసు కళా జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనల గురించి, నేరాల నియంత్రణ గురించి, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ లేకుండా ప్రయాణించరాదని, ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని, అట్టి ప్రకటనలను చూసి బ్యాంక్ సమాచారం / ఏటిఎం కార్డ్ సమాచారం ఇవ్వకూడదని, మహిళల రక్షణ కోసం 24 గంటలు షి టీమ్ పనిచేస్తున్నాయని, మహిళలు ఆపద సమయంలో షి టీంను ఉపయోగించే విధానము వివరించారు.
షి టీమ్ నెంబర్ 9490618029 ఉపయోగించుకోవాలని, సైబర్ నేరాల గురించి అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామంలో మూడ నమ్మకాలు నమ్మవద్దని, నకిలీ గల్ఫ్ ఏజెంట్ మోసాల గురించి చెప్పారు. హెల్మెట్ బరువు కాదు బాధ్యత అని, ఆన్లైన్ మోసాల గురించి అప్రమత్తంగా ఉండాలని వాటి గురించి క్షుణ్ణంగా నాటక రూపంలో వివరించారు.
కార్యక్రమంలో కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీధర్ గౌడ్, గ్రామ సర్పంచ్ పాలేపు సాయమ్మ గంగారాం, ఉప సర్పంచ్-అశోక్, ఎంపిటిసి సభ్యులు- సుప్రియ శ్రీకాంత్, రవికిరణ్, గ్రామ విడిసి సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు - April 16, 2021
- నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్ - April 16, 2021
- మహిళల భద్రతకై క్యూ.ఆర్.కోడ్ - April 16, 2021