Breaking News

పంచాయతీ కార్యదర్శికి చార్జి మెమో

కామారెడ్డి, మార్చ్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంపోస్టు షెడ్డు నిర్వహణలో అల‌సత్వం వహించినందున పంచాయతీ కార్యదర్శి సౌజన్య, ఉపాధి హామీ ఏపీవో రజినిల‌కు ఛార్జి మెమోలు జారీ చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు. దోమకొండ మండల‌ కేంద్రంలోని కంపోస్టు షెడ్డును బుధవారం ఆయన పరిశీలించారు. షెడ్డులో తడి పొడి చెత్తను వేరు చేయడంలో జాప్యం చేస్తున్నందుకు మెమోలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

మండల‌ కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామంను పరిశీలించారు. వైకుంఠధామం చుట్టూ మొక్కలు నాటాల‌ని సూచించారు. నాటిన మొక్క చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేయాల‌ని కోరారు. సీతారాంపల్లిలోని నర్సరీని పరిశీలించారు. నర్సరీలో నిబంధనల‌కు అనుగుణంగా మొక్కలు పెంచడం లేదని పంచాయతీ కార్యదర్శి, ఎంపిఓ కు ఛార్జి మెమోలు జారీ చేశారు. కంపోస్టు షెడ్డును పరిశీలించారు.

షెడ్డుకు తడి పొడి చెత్తను తరలించి సేంద్రియ ఎరువు తయారు చేయాల‌ని సూచించారు. బీబీపేట మండలం జనగామలో నర్సరీని పరిశీలించారు. అవెన్యూ ప్లాంటేషన్ల నాటిన మొక్కల‌ నిర్వహణ సక్రమంగా లేదని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి పదవి కాలం మూడు నెల‌లు పెంచారు.

నర్సరీలో ప్రజల‌కు అవసరమైన మొక్కల‌ను పెంచాల‌ని పేర్కొన్నారు. జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ పాటిల్‌, దోమకొండ సర్పంచ్‌ అంజలి, ఎంపీపీలు సదానంద, బాల‌మణి, జడ్పిటిసి సభ్యుడు తిరుమల‌ గౌడ్‌, ఎంపీడీవోలు చెన్నారెడ్డి దోమకొండ, నారాయణ బీబీపేట, అధికారులు పాల్గొన్నారు.

Check Also

చత్తీస్‌ఘడ్‌ అమర జవాన్లకు నివాళి

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్తీస్‌ ఘడ్‌ బీజాపూర్‌లోని మావోయిస్టుల‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర ...

Comment on the article