Breaking News

నీటిపారుదల‌ శాఖల‌ భూములు, ట్యాంకుల‌ వివరాలు నమోదు చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటిపారుదల‌ శాఖ మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకు వివరాల‌ను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. బుధవారం నీటిపారుదల‌ శాఖ అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. జిల్లాలోని అన్ని మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకు వివరాల‌ను పూర్తి నీటి మట్టం వరకు సేకరించి ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల‌ని తెలిపారు.

అదేవిధంగా నీటిపారుదల‌ శాఖకు సంబంధించిన ఖాళీగా ఉన్న భూముల‌ వివరాల‌ను సర్వే చేసి మూడు రోజుల‌లోగా అందించాల‌ని పేర్కొన్నారు. జిల్లాలో నిర్మిస్తున్న 30 చెక్‌ డ్యామ్‌ పనుల‌కు మార్చి చివరికల్లా పూర్తిచేయాల‌ని, అందుకు కావల‌సిన ఇసుకను సంబంధిత ఆర్టీవోలు సరఫరా చేయుటకు చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో ఈఈ లు అశోక్‌ కుమార్‌, భాను ప్రకాష్‌ సహాయ సంచాల‌కులు మైన్స్‌ సత్యనారాయణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కరోనా ఉదృతి నివారణకు విస్తృత చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేగంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి అధికారులు మరింత ...

Comment on the article