Breaking News

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి ఉపాధి జనరేషన్‌ ప్రోగ్రాంలో యువతను ప్రోత్సహిస్తూ విరివిగా రుణాలు అందించాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి బ్యాంకు అధికారుల‌ను కోరారు. బుధవారం కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా పరిశ్రమల‌ కేంద్రం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాంపై కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం నిబంధనల‌ మేరకు సర్వీస్‌ సెంటర్‌లో 25 ల‌క్షల‌ వరకు రుణాలు అందించడానికి అవకాశం ఉన్నందున, ఉత్పత్తియేతర రంగంలో 5 ల‌క్షల‌ పైగా రుణాలు అందించడానికి ఉన్నందున ముందుకు వచ్చే ఔత్సాహికుల‌ను ప్రోత్సహించడానికి సరళతరంగా విరివిగా రుణాలు అందించాల‌ని తద్వారా వారితో పాటు పలు కుటుంబాల‌కు ఉపాధి అవకాశం ల‌భిస్తుందని ఆయన తెలిపారు. గ్రామీణ స్థాయిలో 35 శాతం పట్టణ స్థాయిలో 25 శాతం సబ్సిడీ అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా వాటిని మంజూరు చేయుటకు సంబంధిత శాఖల‌ అధికారులు బ్యాంకర్లు శ్రద్ధ తీసుకోవాల‌ని ఆయన పేర్కొన్నారు.

రుణాల‌ కొరకు వచ్చిన దరఖాస్తుల‌ను పరిశీలించి సంబంధిత శాఖలు ఎప్పటికప్పుడు బ్యాంకర్లకు తగు చర్య ల‌కై పంపించాల‌ని బ్యాంకు అధికారులు దరఖాస్తులు పరిశీలించి అర్హమైనవి ఉంటే వెంటనే రుణాల‌ మంజూరుకు చర్యలు తీసుకోవడంతో పాటు అర్హత లేకుంటే తగు కారణాలు చూపిస్తూ వాటిని దరఖాస్తుదారుల‌కు పంపించాల‌ని కలెక్టర్‌ తెలిపారు. రుణాల‌ మంజూరులో ఎస్సీలు, ఎస్‌టిల‌ కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల‌ని అధికారుల‌కు సూచించారు.

ఇప్పటివరకు 308 దరఖాస్తులు రాగా బ్యాంకర్లు ఇరవై ఎనిమిది మందికి రుణాలు మంజూరు చేశారని మిగతావి కూడా సకాలంలో చర్యలు తీసుకొనుటకు కృషి చేయాల‌ని కలెక్టర్‌ అధికారుల‌ను, బ్యాంకర్లను కోరారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల‌ శాఖ అధికారి బాబురావు, ఎల్‌డిఎం జయ సంతోషి, సంక్షేమ శాఖ అధికారులు, ఇతర శాఖల‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రత్యేక అవసరాలు గల పిల్ల‌ల‌కు పరికరాల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల‌ విద్యాశాఖ సంచాల‌కులు తెలంగాణ హైదరాబాద్‌ వారి ఆదేశానుసారం ...

Comment on the article