నిజామాబాద్, మార్చ్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ ప్రజలు ఏకతాటిపై ఉంటే ప్రభుత్వం మీ వెనకాల ఉంటుందని జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి నవీపేట మండలం కమలాపూర్ గ్రామంలో అంకాలమ్మ, పోలేరమ్మ ఆయా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామ దేవతలను గ్రామ పొలిమేరలో ఏర్పాటు చేసుకుంటే గ్రామానికి ఎటువంటి కష్టం ఉండదనే సంకల్పంతోనే అందరూ దేవాలయాలను నిర్మించుకుంటారన్నారు.
కమలాపూర్ గ్రామస్తులు యూనిట్‌గా గ్రామ అభివృద్ధి చేసుకోవాలని మీరడిగిన వాటిని తన వంతు సహాయం అందజేస్తామన్నారు. పల్లె ప్రగతిలో సీఎం ఆశయం మేరకు ప్రతి ఊరు పచ్చగా ఉండాలని, హరితహారం, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, ప్రతి ఊర్లో నిర్మించుకోవడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంత మంచి గుడి చాలా గ్రామాలలో లేదని మీ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నందుకు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆలయ ప్రాంగణంలో తాగునీటి సౌకర్యం వాటర్ ట్యాంక్ కల్పించిన రెడ్డి కుటుంబాన్ని అభినందించారు. గ్రామ ప్రజలు ఏకతాటిపై ఉంటే ప్రభుత్వ యంత్రాంగం గ్రామ అభివృద్ధికి అన్ని విధాల సహాయంగా ఉంటుందన్నారు. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కలిసి మెలిసి ఉంటాం అలాంటి ప్రాంతాన్ని మనకు అనుకూలంగా మలచుకుని గ్రామంలో ఉండే వారికి స్వర్గసీమ అవకాశం ఉందన్నారు. మీరు అడిగినవి ఇచ్చే విధంగా చూస్తామన్నారు.
బడ్జెట్ చూసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. ప్రతి గ్రామం పచ్చగా ఉండాలంటే గ్రామంలో మీరు చేయాల్సినవి ఊరిలో మొక్కలు నాటుకొని సంరక్షించుకోవాలని, ఊరంతా పచ్చగా కనిపించాలని గ్రామంలో శానిటేషన్ బాగుండాలని, గ్రామంలో ఉన్న వారికి క్రమశిక్షణ ఉండాలని రోడ్డుమీద వేయరాదని తెలిపారు. ప్రభుత్వం నుండి మీకు సహాయం అందుతుందని, అభివృద్ధి చెందుతుందన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ నవిపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో గల జిపి నర్సరీ సందర్శించారు. నర్సరీ చాలా బాగుందని ప్రతి జిపిలో ఇదే విధంగా ఉండాలన్నారు. అనంతరం మోడల్ స్కూల్ సందర్శించారు.
స్కూల్లో సరస్వతి పూజ నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి కోవిడ్‌పై జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించాలని, డిస్టెన్స్ పాటించాలని కోవిడ్‌కు సంబంధించి జాగ్రత్తగా ఉండాలని, క్లాసు, ప్లే గ్రౌండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని విద్యార్థులకు తెలిపారు. అనంతరం పల్లె ప్రకృతి వనం సందర్శించారు. వాచ్ అండ్ వార్డు చేస్తున్న అతనితో రోజు ఎంత కూలి వస్తుందని తెలుసుకున్నారు. మూడు నెలలు వాటర్ ఇచ్చి గట్టిగా కాపాడాలని తెలిపారు.
వర్షాకాలం ఇబ్బంది ఉండదని తెలిపారు. ఉపాధి హామీ పని ఎలా నడుస్తుందని అధికారులను అడిగారు. అన్ని గ్రామాలలో నడుస్తుందని తెలిపారు. ఏవిన్యూ ప్లాంటేషన్‌పై బాగా ఫోకస్ చేయాలన్నారు. కలెక్టర్ వెంబడి శాఖ సహాయ సంచాలకులు సోమయ్య, ఎంపీడీవో సాజిద్ అలీ, ఎమ్మార్వో లతా, సర్పంచు శ్రీనివాస్, గద్ద సూరమ్మ రామ్ కిషన్, ఎంపీపీ శ్రీనివాస్, టెంపుల్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపిటిసి తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బోధన్ ప్రాంత ప్రజలు అలర్ట్ - April 19, 2021
- రెండు రోజుల్లో ఇద్దరి మృతి - April 19, 2021
- ఎక్కడివక్కడే… ఏమిటివి… - April 19, 2021