Breaking News

టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి

డిచ్‌పల్లి, మార్చ్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని హిందీ విభాగాధిపతిగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. వి. పార్వతి నియమితుల‌య్యారు. ఉపకుల‌ప‌తి నీతూ కుమారి ప్రసాద్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం నియామక ఉత్తర్వుల‌ను శుక్రవారం డా. వి. పార్వతికి అందించారు. కాగా ఇప్పటి వరకు హిందీ విభాగాధిపతిగా డా. జమీల్‌ అహ్మద్‌ వ్యవహరించారు. డా. పార్వతి ప్రస్తుతం టీయూ బాలికల‌ హాస్టల్‌కు వార్డెన్‌ గా వ్యవహరిస్తున్నారు.

ఇదివరకు హిందీ విభాగానికి పాఠ్యప్రణాళికా సంఘ చైర్‌ పర్సన్‌గా కొనసాగారు. హిందీ విభాగాధిపతిగా తనను నియమించిన వీసీ, రిజిస్ట్రార్‌కు డా. వి. పార్వతి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. డా. వి. పార్వతిని హిందీ విభాగ అధ్యాపకులు డా. ప్రవీణాబాయి, డా. జమీల్‌ అహ్మద్‌, ఇతర విభాగాల‌ అధ్యాపకులు, అధ్యాపకేతరులు, పరిశోధకులు అభినందనలు తెలిపారు.

Check Also

కెసిఆర్‌ నిర్ణయంతో నిరుద్యోగుల‌కు తీవ్ర అన్యాయం

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల‌కు పెంచిన వయోపరిమితి నిర్ణయాన్ని ...

Comment on the article