Breaking News

అంచనాలు ఏర్పరచుకోవడమే కాదు వాటిని సాధిస్తేనే అత్మతృప్తి

కామారెడ్డి, మార్చ్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంచనాలు ఏర్పరచుకోవడమే కాదు వాటిని సాధిస్తేనే అత్మతృప్తి కలుగుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. శనివారం అసిస్టెంట్‌ కలెక్టరు హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ శిక్షణ కాలం ముగిసినందున వీడ్కోలు సమావేశం జనహిత భవన్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ కలెక్టరును జిల్లా కలెక్టరు, జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టరు వెంకటేశ్‌ ధోత్రే, బాన్సువాడ ఆర్‌డివో రాజాగౌడ్‌, జిల్లా అధికారులు సన్మానించి సాదరంగా వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్ర‌మంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ, అంచనాలు ఏర్పరచుకొని సాధిస్తేనే ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. అసిస్టెంట్‌ కలెక్టరు తన శిక్షణా కాలంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలును గమనించారని, వాటిని ప్రజల‌కు అందే క్రమాన్ని అధ్యయనం చేశారన్నారు. వ్యక్తి వేరు, వ్యక్తిత్వ వికాసం వేరని, మనం చేసే పనుల‌ ద్వారానే వికాసం బయటపడుతుందని, అలాంటి కోవకు చెందిన హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ తన శిక్షణా కాలంలో కామారెడ్డి జిల్లా గురించి ఎంతో తెలుసుకున్నారని, కామారెడ్డి జిల్లా ఇ గవర్నెన్స్‌ అవార్డు సాధించడంలో హేమంత్‌ కేశవ్‌ పాటిల్ కీల‌క పాత్ర పోషించారని, అతని కెరీర్‌ లో ప్రజల‌కు మరింత సేవ‌లు అందించాల‌ని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా అదనపు కలెక్టరు వెంకటేశ్‌ ధోత్రే మాట్లాడుతూ, హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ శిక్షణ కోసం జిల్లాకు వచ్చి దాదాపు సంవత్సర కాలం అవుతుందని, ఈ సంవత్సరంలో అతి క్లిష్టమైన కరోనా నేపథ్యంలో తీసుకున్న చర్యల‌ను చాలా దగ్గర నుండి గమనించారని, పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా ప్రజల‌కు కావల‌సిన అవసరాల‌ను దగ్గర నుండి గమనించారని తెలియచేస్తూ భవిష్యత్‌లో ప్రజల‌కు ఎన్నో సేవలందించాల‌ని అన్నారు.

తనకు జరిగిన వీడ్కోలు గురించి ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ మాట్లాడుతూ, ఐఎఎస్‌ ద్వారా తాను తెలంగాణ కేడర్‌కు కేటాయించబడ్డానని, అందులో కామారెడ్డి జిల్లాకు వచ్చి తన శిక్షణ ముగించుకోవడం సంతోషంగా వుందని, ఇక్కడ చాలా నేర్చుకున్నానని, కామారెడ్డి జిల్లా ప్రజలు ఎంతో చైతన్యవంతుల‌ని, ప్రభుత్వ పథకాల‌ను సద్వినియోగం చేసుకుంటున్నారని, జిల్లా కలెక్టరు తన శిక్షణా కాలంలో అన్ని విధాలుగా గైడెన్స్‌ ఇచ్చారని, జిల్లా యంత్రాంగం తనకు ఎంతో సహాయపడిందని, భవిష్యత్‌ లో జిల్లాకు తిరిగి రావాల‌ని కోరుకుంటున్నానని అన్నారు. వీడ్కోలు సమావేశంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

చత్తీస్‌ఘడ్‌ అమర జవాన్లకు నివాళి

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్తీస్‌ ఘడ్‌ బీజాపూర్‌లోని మావోయిస్టుల‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర ...

Comment on the article