Breaking News

శివ నామ స్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు

మోర్తాడ్‌, మార్చ్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని ఆయా గ్రామాల‌లో గురువారం మహాశివరాత్రిని పురస్కరించుకుని శివాల‌యాల‌లో భక్తులు ఉదయం నుండి రాత్రివరకు భక్తి శ్రద్దల‌తో పూజలు నిర్వహించారు. గ్రామాల్లో నమ: శివాయ నామ స్మరణతో మందిరాలు మారు మ్రోగాయి.

సాయంత్రం శివ పార్వతుల‌ కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆయా ఆల‌యాల‌ కమిటీ సభ్యులు భక్తుల‌ సౌకర్యార్థం తాగునీరు, షామియానాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం పలు ఆల‌యాల్లో అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Check Also

ప్రెస్‌ క్లబ్‌ కార్యవర్గానికి సన్మానం

మోర్తాడ్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో నూతనంగా ఎన్నికైన ...

Comment on the article