Breaking News

ఆడపిల్ల‌ల‌ను రక్షిద్దాం

కామారెడ్డి, మార్చ్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ తన కార్యాల‌యంలో ఆరోగ్య చేతన్య వేదిక క్యాలెండర్‌, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్చంద సంస్థ ఆరోగ్య అంశాల‌పై అవగాహన కల్పించడం పట్ల వారిని అభినందించారు. ఆరోగ్య శాఖలో సేవ‌లు అందిస్తూ ఏసివి కార్యక్రమాలో పాల్గొంటున్న చల‌పతి, సంజీవరెడ్డి, వెంకటనారాయణ సేవ‌లు బాగున్నాయన్నారు.

ప్రకృతి వనరుల‌ను సంరక్షణ చేస్తూ వచ్చే తరాల‌కు అందించటం మన కర్తవ్యమని, భూమి, నీరు, పరిసరాల‌ను రక్షించాల‌ని అలాగే ఆరోగ్య సూత్రాలు పాటించి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మిద్దామన్నారు. నేడు సమాజంలో ఆడపిల్ల‌లు తగ్గుతున్నారని, ఆడపిల్లలు ప్రకృతి మూలం కావున వారిని రక్షిద్దాం అని డిఎం అండ్‌ హెచ్‌వో తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ అనిల్‌ కుమార్‌, డా.శోభారాణి, డా.శిరీష, డా.రాజు, డాక్టర్‌ సుష్మిత, వి.రవికుమార్‌, వి.సంజీవరెడ్డి, ఎం.రాణి, సుధాకర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Check Also

అల‌క్ష్యం చేస్తే చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్లు వేగంగా నిర్వహించాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ...

Comment on the article