Breaking News

బేటీ బచావో – బేటీ పడావోపై అవగాహన

నిజామాబాద్‌, మార్చ్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ, జిల్లా మహిళ, శిశు దివ్యాంగుల‌ మరియు వయోవృద్దుల‌ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో – బేటీ పడావో అనే అంశంపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆశ, నోడల్‌ ఆఫీసర్‌, ఏఎన్ఎంలు, ఆశాల‌కు ఆడపిల్ల‌ల‌ ప్రాముఖ్యత మరియు ఆడపిల్ల‌ల‌ సంఖ్య పెంచడానికి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కానింగ్‌ సెంటర్‌లో పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డనా, మగబిడ్డనా అని అడిగిన వారికి, చెప్పిన వారికి, అందుకు ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ రాజేశ్‌, గంగాధర్‌, సిడిపివో సౌందర్య, డిహెచ్‌ఇ వెంకటేశ్‌, మంజుల‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాష్ట్ర మహాసభ జయప్రదం చేయండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రగతిశీల‌ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో ...

Comment on the article