Breaking News

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, మార్చ్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాయిసింహ వైద్యశాల‌లో బీబీ పేట మండలం తూజాల్పూర్‌ గ్రామానికి చెందిన స్రవంతి (25) మహిళకు ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన జంగం వెంకటేష్‌ మానవతా దృక్పథంతో స్పందించి రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు.

ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ అన్ని దానాల‌లో కెల్లా రక్త దానం గొప్పదని 18 సంవత్సరాల‌ నుండి 58 సంవత్సరాల‌ వయసు కలిగిన వారందరూ రక్తదానం చేయడానికి అర్హులే అన్నారు. సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేసే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సురేశ్‌రెడ్డి, యాదగిరి గౌడ్‌, నరేందర్‌ గౌడ్‌, టెక్నీషియన్‌ చందన్‌ పాల్గొన్నారు.

Check Also

అల‌క్ష్యం చేస్తే చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్లు వేగంగా నిర్వహించాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ...

Comment on the article