Breaking News

స్వాతంత్య్రాన్ని నిల‌బెట్టుకోవల‌సిన బాధ్యత అందరిదీ

నిజామాబాద్‌, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంతోమంది ప్రాణ త్యాగాల వ‌ల్ల‌ మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని దానిని నిబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా మరియు సెషన్స్‌ జడ్జి సాయి రమాదేవి అన్నారు. 75 సంవత్సరాల‌ స్వాతంత్ర ఉత్సవాల‌ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవములో భాగంగా బుధవారం జిల్లా యంత్రాంగం నిర్వహించిన ఫ్రీడమ్‌ టూ-కే రన్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా అటవీ అధికారి సునీల్‌తో కలిసి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ మనకోసం మన పూర్వీకులు సాధించిపెట్టిన స్వేఛ్ఛ రైట్‌ టు ఫ్రీడమ్‌ ఎంతో కష్టపడి సాధించినదని దాన్ని మనం ఎంత కష్టమైనా నిబెట్టుకోవాల‌న్నారు. ఏదీ కూడా ఈజీగా రాదని, జీవితంలో ప్రతిదీ కష్టంగానే తెచ్చుకోవాల‌ని, కష్టంగానే నిల‌బెట్టుకోవాల‌ని 75 స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సవాల‌ను ఘనంగా జరుపుకుంటున్నామని వంద సంవత్సరా ల‌సెల‌బ్రేషన్స్‌ కూడా అంతే ఘనంగా జరుపుకోవాల‌ని కోరుకుంటున్నానని తెలిపారు.

యువత తలుచుకుంటే జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదని కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించడం, లేదా అనుకున్న రంగంలో స్థిరపడడానికి కృషి చేయాల‌ని దేశం కోసం మంచి కార్యక్రమాలు చేపట్టి దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నానన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భావితరాల‌కు భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియ చేయుటకు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల‌ యొక్క సేవల‌ను స్మరించుకుంటూ దేశ ప్రగతిని భావితరాల‌కు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో భారత దేశాన్ని ఏ విధంగా ముందుకు వెళితే అభివృద్ధి దిశగా ముందుకు సాగవచ్చని పిలుపునిచ్చారు.

మనకు స్వాతంత్య్రం సిద్ధించి 2022 ఆగస్టు 15 నాటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నామని, 75 సంవత్సరాల‌ మన దేశం పలు రంగాల‌లో అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాల‌లోనే భారత దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకు రావడం జరిగిందని, అంతేకాక ఒక గొప్ప శక్తిగా మనం ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. మనం దేశం కోసం సమాజం కోసం చేయాల్సిన కార్యక్రమాల‌ను గుర్తించుకుంటూ 75వ సంవత్సరాల‌ స్వతంత్ర వేడుకల‌ను గొప్పగా నిర్వహించుకోవాల‌ని, ప్రభుత్వం ముందుగానే 75 వారాల‌పాటు ప్రతి వారం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుంటూ 75 సంవత్సరాల‌ ఇండిపెండెన్స్ సెల‌బ్రేషన్స్‌ గొప్పగా జరుపుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.

అందులో భాగంగా మొదటి వారం ఫ్రీడం టు రన్‌ మన అందరికీ గొప్ప అనుభూతిని ఇచ్చిందని, ప్రతి కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుపుకోవాల‌ని ప్రతి ఒక్కరూ దేశ ప్రగతికి దేశ ప్రజల‌ యొక్క సంక్షేమానికి పాటుపడాల‌ని కోరారు. టూకే రన్‌ ఫులాంగ్‌ చౌరస్తా నుండి కలెక్టరేట్‌ వరకు నిర్వహించిన అనంతరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫ్రీడం టు కె రన్‌లో అడిషనల్‌ కలెక్టర్‌లు ల‌త, చంద్రశేఖర్‌, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌, నెహ్రూ యువ కేంద్ర సమన్వయకర్త శైలి, కలెక్టర్‌, సిపి, డిఎఫ్‌ఓ సతీమణులు, టిఎన్జీవోస్‌ అధ్యక్షులు అల‌క కిషన్‌, జిల్లా అధికారులు, విద్యార్థిని విద్యార్థులు, ఎన్‌సిసి, స్కౌట్‌, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాజ్యసభ సభ్యులు సురేశ్‌రెడ్డి మొక్కలు నాటారు…

హైదరాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ...

Comment on the article