Breaking News

అల‌సత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు

కామారెడ్డి, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంపోస్టు షెడ్ల ద్వారా సేంద్రియ ఎరువులు తయారుచేసి గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంచుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. రామారెడ్డి మండల‌ కేంద్రంలోని రైతు వేదికలో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.

గ్రామ పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా తడి, పొడి చెత్త వేరుగా సేకరించి కంపోస్టు షెడ్డుకు తరలించే విధంగా చూడాల‌న్నారు. అన్నీ కంపోస్ట్‌ షెడ్లు వాడుకలోకి తీసుకురావాల‌ని సూచించారు. పల్లె ప్రకృతి వనాల‌లో నాటిన మొక్కల‌కు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించి సంరక్షించాల‌ని కోరారు. రైతు వేదికల‌ ద్వారా తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంటల‌పై రైతుల‌కు అవగాహన కల్పించాల‌ని ఎఈవోల‌ను ఆదేశించారు.

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించే పంటల‌పై ఆదర్శ రైతుల‌తో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాల‌ని‌ పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ల‌బ్ధిదారుల‌కు అందేలా చూడాల‌ని అధికారుల‌ను కోరారు. అల‌సత్వం ప్రదర్శించే అధికారుల‌ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతు కళ్లల‌ను ఈనెల‌ 31లోగా పూర్తిచేయాల‌ని సూచించారు. కరోనా నియంత్రణకు వైద్య సిబ్బంది కృషి చేయాల‌ని కోరారు.

ప్రతిరోజు నిర్ధారణ పరీక్షలు చేయాల‌ని పేర్కొన్నారు. మిషన్‌ భగీరథ, విద్యుత్తు, ఉపాధి హామీ, వ్యవసాయం తదితర శాఖల‌పై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, ఎంపీపీ దశరథ రెడ్డి, జడ్పిటిసి సభ్యుడు నా రెడ్డి మోహన్‌ రెడ్డి, డిఆర్‌డిఓ చంద్రమోహన్‌ రెడ్డి, ఆర్డిఓ శీను, అధికారులు పాల్గొన్నారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article