Breaking News

వేలం ద్వారా ల‌క్షల‌ ఆదాయం

కామారెడ్డి, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పోలీసు స్టేషన్‌లో పనిచేయని జనరేటర్లు, ఇన్వర్టర్లు, బ్యాటరీలు, ఎల‌క్ట్రానిక్‌, ఫర్నీచర్‌, ఇతర సామాగ్రిని గురువారం వేలం వేసినట్టు ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ డిఎస్‌పి ఉదయకృష్ణ తెలిపారు. కాగా వీటి ద్వారా రూ. 2 ల‌క్షల‌ 65 వేల‌ 500 ఆదాయం సమకూరినట్లు చెప్పారు.

జిల్లా పోలీసు హెడ్‌ క్వాటర్స్‌ కార్యాల‌యంలో గురువారం బహిరంగ వేలం నిర్వహించారు. డిపివో ఏవో జగపతిరాజు, స్టోర్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు, రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్‌ నరసింహరావు, కమ్యూనికేషన్‌ ఎస్‌ఐ నవీన్‌ కుమార్‌, ఆర్‌ఎస్‌ఐలు ఫనహర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article