కామరెడ్డి, మార్చ్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 202 మందికి లబ్దిదారులకు 2 కోట్ల 2 లక్షల 23 వేయిల 432 రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముభారక్ చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3,747 మందికి 37 కోట్ల 12 లక్షల 2 వేల 332 రూపాయల కల్యాణలక్ష్మి, షాది మూభారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం కావద్దనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఆడబిడ్డను మగబిడ్డతో సమానంగా పెంచాలన్నారు. ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021