నిజామాబాద్, మార్చ్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టి బి నివారణలో జాతీయ స్థాయి అవార్డు రావడం గర్వకారణమని, ఇందుకు పని చేసిన క్షేత్ర స్థాయి సిబ్బందిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఈ నెల 24న ప్రపంచ టి.బి. నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా ఆసుపత్రి లో నేషనల్ టిబి ఎలిమినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రాంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణలో జిల్లాకు జాతీయ స్థాయిలో కాంస్య పతకం, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ జిల్లాగా ఎంపిక కావడం సిబ్బంది పనితీరుకు నిదర్శనమని ప్రశంసించారు. తద్వారా మనపై ఇంకా బాధ్యత పెరిగిందని, వచ్చే సంవత్సరం ఇంకా బాగా కృషిచేసి బంగారు పతకం సాధించడానికి ప్రతి ఒక్కరు కష్ట పడి పనిచేయాలని కలెక్టర్ కోరారు.
క్రింది స్థాయి సిబ్బంది గ్రామాల్లో పర్యటించినప్పుడు ప్రజల నుండి క్షయ వ్యాధికి సంబంధించిన లక్షణాలు గురించి వాకబు చేయాలని, వ్యాధులపై అశ్రద్ధ చేస్తారని, అందువల్ల గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన జాగ్రత్తలు తెలపడంతో పాటు మందులు వాడుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఆశా వర్కర్ల పాత్ర ఎంతైనా ముఖ్యమైనదని తెలిపారు.
ముందుగానే వ్యాధిని గుర్తించి వ్యాధి పక్కవారికి సోకకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలని, అవసరమైన చికిత్స అందించాలని ఆదేశించారు. అవార్డ్ సాదించిన బృందాన్ని అభినందించి వారికి జ్ఞాపికలు అందించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున కష్టపడి పని చేయాలని, ప్రతి టిబి పేషెంట్‌కు వ్యాక్సిన్ వేయాలని, కరోనా కేసులు పెరుగుతున్నందున ఒక డ్రైవ్‌లాగా పని చేయాలన్నారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, డిఎంహెచ్ఓ సుదర్శనం, డాక్టర్ విశాల్, డా. బాలరాజు, డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021